పేర్లు బయటపెడితే.. జాగ్రత్తపడిపోతారు!
నల్లకుబేరుల పేర్లను తొందరపడి ఇప్పుడే బయటపెడితే, వాళ్లు వెంటనే జాగ్రత్తపడిపోతారని, అందువల్ల ఆ పేర్లు బయట పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. నల్లధనం అంశంపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. పన్నుల వ్యవస్థ స్నేహపూర్వకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని జైట్లీ తెలిపారు.
నల్లధనం అంశం దేశం వెలుపల, లోపల చాలా తీవ్రమైనదని, ఇది స్నేహపూర్వకంగా లేకపోవడంతో పెట్టుబడిదారుల్లో భారతదేశానికి చాలా చెడ్డపేరు వచ్చిందని ఆయన అన్నారు. విదేశీ అకౌంట్ల నుంచి ఇప్పటికే కొంతమంది డబ్బు విత్డ్రా చేసేసుకున్నారని అన్నారు. తాము గుర్తించిన 427 విదేశీ ఖాతాలపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. నల్లధనానికి అడ్డుకట్ట వేయడానికి అవినీతి నిరోధక చట్టానికి సవరణలు చేస్తామని ఆర్థికమంత్రి వెల్లడించారు.