
ప్రపంచవ్యాప్తంగా ‘చీకటి గంట’
న్యూఢిల్లీ: పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ప్రచారం కోసం నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ను శనివారం ప్రపంచవ్యాప్తంగా పాటించారు. వేలాది నగరాల్లోని కోట్లాది ఇళ్లు, కార్యాలయాల్లోకి గంటపాటు స్వచ్ఛందంగా చీకటిని ఆహ్వానించారు. పలు దేశాల్లోని ప్రసిద్ధ పర్యాటక స్థలాలు, భవనాల్లో రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు గంటపాటు విద్యుత్ దీపాలను ఆర్పేశారు.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, ఎర్రకోట, కోల్‌కతాలోని హౌరా వంతెన తదితర ప్రాంతాలు చీకట్లో దోబూచులాడాయి. పారిస్‌లోని ఈఫిల్ టవర్, సిడ్నీలోని ఒపేరా హౌస్, లండన్‌లోని బ్రిటిష్ పార్లమెంట్, న్యూయార్క్‌లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌లలో లైట్లు ఆర్పేశారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఏటా మార్చి చివర్లో ఎర్త్ అవర్‌ను నిర్వహిస్తుండడం తె లిసిందే.