న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు ఒప్పందాన్ని అమల్లోకి తీసుకురావడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్, త్రిపుర, మేఘాలయల్లోని పలు ప్రాంతాలను బిల్లులో చేర్చారు.
దీన్ని నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును మొదట లోక్‌సభలో ప్రవేశపెట్టాలనుకున్న ప్రభుత్వం అస్సాం భూభాగాల చేర్పునకు సంబంధించి విపక్షం నుంచి వ్యతిరేకత రావడంతో అస్సాం భూభాగాలను కూడా బిల్లులో చేర్చి తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
బంగ్లా సరిహద్దు బిల్లుకు కేబినెట్ ఓకే
Published Wed, May 6 2015 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:29 AM
Advertisement
Advertisement