
సాక్షి, ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్ని గగన్‌యాన్‌కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం భేటీ అయిన కేంద్రమంత్రి వర్గం సంబంధిత దస్త్రంపై ఆమోదముద్ర వేసింది. గగన్‌యాన్ ద్వారా ముగ్గురు మనుషులను అంతరిక్షంలోకి పంపునున్న విషయం తెలిసిందే. దీనికి జీఎస్ఎల్వీ మార్క్-3ని ఉపయోగిస్తారు. ఈ ప్రాజెక్టు కోసం 10వేల కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది.
కాగా గగన్‌యాన్‌ను త్వరలోనే ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సం (ఆగస్ట్ 15) సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. జాతీయ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, ఇతర సంస్థల సమన్వయంతో ఇస్రో గగన్‌యాన్ కార్యక్రమంలో సిబ్బందికి శిక్షణ ఇస్తుంది, ఫ్లైట్ సిస్టమ్స్, గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తుంది. గగన్‌యాన్ ద్వారా అంతరిక్ష రంగంలో భారత శక్తిసామర్థ్యాలు ఇస్రో ప్రపంచానికి చాటునుంది.
Comments
Please login to add a commentAdd a comment