'ఈ-మనీ ఆర్డర్ పరిమితి పెంపునకు చర్యలు' | centre likely to extend e- money order limitations | Sakshi
Sakshi News home page

'ఈ-మనీ ఆర్డర్ పరిమితి పెంపునకు చర్యలు'

Published Thu, May 7 2015 1:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM

centre likely to extend e- money order limitations

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-మనీ ఆర్డర్ విధానంలో సాధారణ మనీ ఆర్డర్ పరిమితిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ తెలిపారు. బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ఈ అంశాన్ని లేవనెత్తారు.

సాధారణ మనీ ఆర్డర్‌ను రూ.5 వేలకే పరిమితం చేయడంతో ఇబ్బంది కలుగుతోందని, ఈ పరిమితిని పెంచాలని కోరారు. సాధారణ మనీ ఆర్డర్ అవధి రూ.5 వేలు ఉందని, మొబైల్ మనీ ఆర్డర్ పరిమితిని రూ.10 వేలు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ-పోస్టు కార్డులు ప్రవేశపెడితే బాగుం టుందని మల్లారెడ్డి సూచించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు.

Advertisement

పోల్

Advertisement