విద్యార్థులకు క్లాస్ చెప్పిన సీఎం
రాజనంద్గావ్: చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఉపాధ్యాయుడి అవతారం ఎత్తారు. రాజనంద్గావ్ ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం పిల్లలకు పాఠాలు బోధించారు. విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. తరగతి ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.
పలు సబెక్టులు గురించి విద్యార్థులతో చర్చించానని చెప్పారు. తనను విద్యార్థులు వివిధ రకాల ప్రశ్నలు అడగం విశేషమని ఆయన వెల్లడించారు. తమ ఇళ్లలో మరుగుదొడ్లు లేవని నలుగురు విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చొనట్టు చెప్పారు. నెల రోజుల్లో ప్రభుత్వం టాయిటెట్లు కట్టిస్తుందని విద్యార్థులకు హామీయిచ్చానని రమణ్ సింగ్ తెలిపారు.