సాక్షి, బెంగళూరు: కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకుపోవడం ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. వెంట పుస్తకాలు ఉంటాయో లేదో చెప్పలేం కానీ చేతిలో ఐఫోన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే కాలేజీ తరగతి గదుల్లోకి ఫోన్లను తీసుకురావద్దని బెంగళూరులోని ఎంఈఎస్ చైతన్య పీయూ కాలేజీ కఠిన నిబంధన విధించింది. అయినా తీరు మార్చుకోని విద్యార్థులు అదేపనిగా తరగతి గదుల్లో ఫోన్ వాడుతున్నారు. లెక్చరర్ పాఠాలు చెబుతున్నా వాట్సప్ చాటింగ్స్‌లో మునిగిపోతున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల ముందే తన ఆగ్రహావేశాలు ప్రదర్శించాడు. విద్యార్థుల వద్దనున్న ఫోన్లను తీసుకుని వారిముందే సుత్తెతో ముక్కలుముక్కలుగా పగలగొట్టాడు. మరెవరైనా ఇంకోసారి తరగతి గదిలోకి చరవాణి తీసుకువస్తే ఇదే విధంగా ముక్కలవుతుందని హెచ్చరించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment