వాట్సప్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీలు
ముంబై: మహారాష్ట్రలో ఇక నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీలను ఫిర్యాదుదారులు వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఎఫ్‌ఐఆర్ కాపీలను తొందరగా అందించేందుకుగాను పోలీసులకు మహారాష్ట్ర డీజీపీ ప్రవీణ్ దీక్షిత్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత మొబైల్ ఫోన్‌తో ఎఫ్‌ఐఆర్ ఫొటో కూడా తీసుకోవచ్చని డీజీపీ పేర్కొన్నారు.
సాధారణంగా క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత ఎఫ్‌ఐఆర్ కాపీలను ఫిర్యాదుదారులకు పంపుతారని, ఇందుకు ఒకటి, రెండు రోజుల సమయం పడుతుందని పోలీసులు చెప్పారు. తాజా నిర్ణయంతో తొందరగా ఎఫ్‌ఐఆర్ కాపీలను ఫిర్యాదుదారులు పొందేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు.