సాక్షి, న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలోని పలు దేశాలకు గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి మున్ముందు ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడం, ఆహారం కొరత మనుషుల్లో ఆక్రోశాన్ని, ఆగ్రహావేశాలను పెంచుతుందని, వారు ప్రభుత్వంపైనా, ప్రభుత్వ యంత్రాంగంపైనా తిరగబడేందుకు సిద్ధంగా ఉంటారని, అలాంటి సమయాల్లో ఏమాత్రం డబ్బులిచ్చి ఆదుకున్నా టెర్రరిస్టు సంస్థల్లో చేరేందుకు ప్రజలు సిద్ధమవుతారని వారు తెలిపారు. (పావురం సిక్స్ ప్యాక్ ట్రైనింగ్ అదిరింది).
ముఖ్యంగా బలహీన వర్గాల ప్రజలు, పేదలు, నిరుపేదలు టెర్రరిస్టు కార్యకలాపాలపై మొగ్గుచూపే అవకాశం ఉంటుందని వారన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు బలహీనంగా ఉన్న దేశాల్లో సరిహద్దు వివాదాలు నెలకొని ఉన్న దేశాల్లో టెర్రరిజమ్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని వారు చెప్పారు. ప్రాంతీయ విభేదాలు ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లో, ముఖ్యంగా నైజీరియాలో బోకో హరామ్ లాంటి టెర్రరిస్టు సంస్థలు పుట్టుకొచ్చి అలజడిని పెంచాయని వారన్నారు. 2019లో విడుదలైన ఓ అంతర్జాతీయ నివేదిక ప్రకారం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియాలోని 55 దేశాలు ఆహారం కొరతను ఎదుర్కొంటున్నాయి, కరోనా కారణంగా ఆ దేశాల్లో ఆహారం కొరత మరింత తీవ్రమైందని, ఆ దేశాల్లో టెర్ర రిస్టు కార్యకలాపాలు పెరిగే ప్రమాదం ఉందని బాయిస్ స్టేట్ యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నిషా బెల్లింగర్ హెచ్చరించారు. (కరోనా: రోజుల తరబడి కోమాలో శిశువు)
Comments
Please login to add a commentAdd a comment