'నితిన్ వద్దన్నాడు.. అందుకే చనిపోతున్నా!' | Delhi model's death: He told me to leave home, I am leaving the world, says Priyanka's suicide note | Sakshi
Sakshi News home page

'నితిన్ వద్దన్నాడు.. అందుకే చనిపోతున్నా!'

Published Mon, Mar 28 2016 10:26 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

'నితిన్ వద్దన్నాడు.. అందుకే చనిపోతున్నా!'

'నితిన్ వద్దన్నాడు.. అందుకే చనిపోతున్నా!'

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ప్రియాంక కపూర్ (26) అనే మోడల్ ఆత్మహత్య కు పాల్పడింది. తన జీవన శైలిని అడుగడుగున అసహ్యించుకుంటున్న భర్తను, అతడు వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖ రాసి చనిపోయింది. తన భర్త తనను ఇళ్లు విడిచి వెళ్లిపోవాలని కసురుకున్నాడని  కానీ తాను మాత్రం ప్రపంచాన్నే విడిచిపెట్టి వెళ్లిపోతున్నానని ఆమె లేఖలో పేర్కొంది. కంపెనీ మేనేజ్ మెంట్ కార్యక్రమానికి అని చెప్పి వెళ్లిన ప్రియాంక ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఏ-46 అనే నెంబర్ గల నివాసంలో సీలింగ్ ఫ్యాన్కు ఉరి పెట్టుకుని ప్రాణాలు విడిచింది.

ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టి ఆమెను కిందికి దించి ఎయిమ్స్కు తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులకు రెండు ఆత్మహత్యకు సంబంధించిన లేఖలు దొరికాయి. వీటి ఆధారంగా, ప్రియాంక కుటుంబ సభ్యుల వివరాల ప్రకారంగా పోలీసులు ఆమె భర్త, వ్యాపార వేత్త నితిన్ చావ్లాను అరెస్టు చేశారు.

ప్రతిరోజు భార్యను కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా పురికొల్పాడని ఆరోపణలు నమోదుచేశారు. ప్రియాంక ఆత్మహత్య లేఖలో ఏం రాసిందంటే..'నితిన్ నన్ను ఇళ్లు వదిలిపొమ్మన్నాడు.. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నాను. అతడు చిన్న చిన్న విషయాలకే నన్ను కొట్టేవాడు. పబ్బులకు, బార్లకు వెళ్లనివ్వకుండా చాలాసార్లు అడ్డుకున్నాడు' అని లేఖలో రాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement