కారు ప్రమాదం : మోడల్‌ మృతి | 26-year-old model killed by speeding car near Satywati College flyover | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదం : మోడల్‌ మృతి

Published Mon, Oct 30 2017 2:02 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

26-year-old model killed by speeding car near Satywati College flyover - Sakshi

న్యూఢిల్లీ : కారు ప్రమాదంలో ఢిల్లీకి చెందిన మోడల్‌ అభిషేక్‌ నరులా మృతి చెందారు. ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న తమ కారును, వేగవంతంగా వచ్చిన మరో సెడాన్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న తన ఇద్దరు స్నేహితులు తీవ్ర గాయాల పాలయ్యారు. ఉత్తర ఢిల్లీలో శనివారం రాత్రి రెండు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. అభిషేక్‌ నరులా ముంబైలో నటుడు, మోడల్‌. తన స్నేహితులతో కలిసి ఆయన భరత్‌ నగర్‌ నుంచి అశోక్‌ విహార్‌ వెళ్తున్నారు. 

సత్యవతి కాలేజీ ఫ్లైఓవర్‌ సమీపంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద అభిషేక్‌ తన కారును ఆపారని, ఆ సమయంలో దూసుకు వచ్చని హోండా సిటీ కారు వీరి కారును ఢీకొట్టినట్టు సీనియర్‌ పోలీసు అధికారి చెప్పారు. అభిషేక్‌, తన ఫ్రెండ్స్‌ రన్‌దీప్‌, యోగేష్‌ గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. వీరిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. అభిషేక్‌ మరణించినట్టు తెలిపారు. దివాళి పండుగ సందర్భంగా అభిషేక్‌ ఢిల్లీ వచ్చారు. భరత్‌ నగర్‌లో తన ఫ్రెండ్‌ రత్నదీప్‌ను కలిసిన అభిషేక్‌, అక్కడే యోగేష్‌ను కూడా కలిశారు. నగదు విత్‌డ్రా కోసం ఏటీఎంకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ప్రమాదనాంతరం నిందిత డ్రైవర్‌ పారిపోవడానికి ప్రయత్నించాడని, హోండా సిటీ కారును అద్దెకు తీసుకుని అతను నడుపుతున్నట్టు పోలీసు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement