తను పబ్‌లకు వెళ్లడం భర్తకు నచ్చలేదు!! | Husband who promised to keep Delhi model happy beat her mercilessly | Sakshi
Sakshi News home page

తను పబ్‌లకు వెళ్లడం భర్తకు నచ్చలేదు!!

Published Tue, Mar 29 2016 3:30 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

తను పబ్‌లకు వెళ్లడం భర్తకు నచ్చలేదు!! - Sakshi

తను పబ్‌లకు వెళ్లడం భర్తకు నచ్చలేదు!!

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన వర్ధమాన మోడల్ ప్రియాంక కపూర్ చావ్లా ఆత్మహత్య చేసుకుందంటే.. ఆమె స్నేహితులు, తెలిసిన వారు నమ్మలేకపోతున్నారు. అందరితో జోవియల్‌గా కలిసిపోతూ.. హుషారుగా ఉల్లాసంగా ఉండే ప్రియాంక ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుందా? అని వారు షాక్‌ వ్యక్తం చేస్తున్నారు.

'ప్రియాంక చాలా ఫ్రెండ్లీ పర్సన్‌. ఆమెకు పెద్ద సోషల్ సర్కిల్‌ ఉండేది. కానీ నితిన్‌తో పరిచయమయ్యాక ఆమె పూర్తిగా మారిపోయింది. ఫేస్‌బుక్ తెరవడం మానేసింది. ఆఖరికీ తన ఫోన్ నంబర్‌ కూడా మార్చేసింది' అని ఆమెతో కలిసి పలు ఈవెంట్లు నిర్వహించిన తెహ్రిమా జకి తెలిపారు. 'మేం చాలా పార్టీల్లో కలిసి పాల్గొన్నాం. సోషల్ మీడియాలో ఎప్పుడూ టచ్‌లో ఉండేవాళ్లం. తను చాలా జోవియల్‌. కానీ ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిసి షాక్‌ తిన్నాను' అని వెడ్డింగ్ ప్లానర్ రమణీక్ పాంతల్ తెలిపారు.

ప్రియాంక బయట అందరితో కలివిడిగా ఉండటం ఆమె భర్త నితిన్‌కు నచ్చలేదని, అదే వారి మధ్య గొడవకు కారణంగా తెలుస్తోంది.  'ప్రియాంక పార్టీల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేది. ఆమెకు చాలామంది పురుష స్నేహితులు ఉన్నారు. అది ఆమె భర్తకు నచ్చలేదు. మొదట డేటింగ్ చేసి.. ఆ తర్వాత ప్రియాంకను పెళ్లాడిన నితిన్‌.. పెళ్లి తర్వాత తన భార్య పనిచేయడం నచ్చడం లేదని చెప్పాడు. అతని తీరు నన్ను ఆశ్చర్య పరిచింది' అని జకీ గుర్తుచేసుకున్నారు.

ఆనందంగా చూసుకుంటానని హామీ ఇచ్చి..!!
ఆమె వెంటపడ్డాడు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆనందంగా చూసుకుంటానని, మంచి జీవితాన్ని ఇస్తానని నమ్మించి ఒప్పించాడు. తీరా పెళ్లాడక ఆమె కలలను ఛిన్నాభిన్నం చేశాడు. పెళ్లయిన కొన్ని నెలలకే ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. ఇది ఢిల్లీ మోడల్ ప్రియాంక ఆత్మహత్య వ్యవహారంలో భర్త నితిన్‌ గురించి.. ఆమె కుటుంబసభ్యులు చెప్తున్న విషయాలు.

అప్పటికే పదేళ్ల కొడుకును కలిగిన నితిన్ చావ్లా మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. గత జనవరి 6న ప్రియాంకను పెళ్లాడాడు. ఆమె తాజాగా భర్తకు నాలుగుపెజీల సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 'తొమ్మిది నెలలపాటు వెంటాడి.. ప్రేమిస్తున్నానని వేధించి.. తమ ఇంటి చుట్టూ నితిన్ తిరిగాడు. ప్రియాంక తనను పెళ్లి చేసుకోకుంటే చనిపోతానని మా అమ్మ కాళ్ల మీద పడి ఏడ్చాడు. ఆమెను సంతోషంగా చూసుకుంటానని మాకు వాగ్దానం చేశాడు. కానీ పెళ్లయిన నెలకే అతడు తన అసలు స్వరూపం బయటపెట్టుకున్నాడు. జనవరి 30న ఉదయాన్నే టీ ఇవ్వలేదని తనను నితిన్‌ దారుణంగా కొట్టాడని ప్రియాకం మాకు ఫోన్‌ చేసి చెప్పింది' అని ప్రియాంక సోదరి డింపీ తెలిపింది. తన పదేళ్ల కొడుకు ఆలనాపాలనా చూసుకోవాలని నితిన్ ప్రియాంకను ఒత్తిడి చేశాడని, స్వతంత్ర వ్యక్తిత్వం గల ఆమె ఇందుకు నిరాకరించడంతో అతడు గొడవలకు దిగాడని, ఇదే తన సోదరి ఆత్మహత్యకు కారణమని ఆమె వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement