
డెహ్రాడూన్: అప్పుల బాధ తట్టుకోలేక ఉత్తరాఖండ్‌లో ఓరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘‘ బీజేపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్ల కాలంలో రైతులను మోసం చేసింది. ఎవ్వరూ కూడా బీజేపీకి ఓటు వెయ్యవద్దు. ఓటేస్తే మరోసారి మోసం చేస్తారు’ అని సూసైడ్ నోట్ రాసి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తిని ఈశ్వర్ చంద్ శర్మ (65)గా గుర్తించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకపోవడంతో గత కొంతకాలంగా అప్పులపాలైయ్యారని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment