న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ లోని చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు యాత్రను నిలిపివేశారు. భూకంపం వల్ల ఉత్తరాఖండ్లోనూ భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. నేపాల్ కేంద్రంగా భూకంపం ఏర్పడిన విషయం తెలిసిందే. నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపిసత్తోంది. మరోవైపు నేపాల్కు భారత్ నుంచి సహాయక బృందాలను పంపిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.