న్యూఢిల్లీ : గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతుభాయ్ వాఘానికి ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లఘించిన కారణంగా ఆయనను మూడు రోజుల పాటు (72 గంటలు) ప్రచారంలో పాల్గొనొద్దని ఆదేశాలు జారీ చేసింది. మే 2 సాయంత్రం 4 గంటల నుంచి ఈ నిషేదం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఇక గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ స్థానాలకు మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఆయన బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వ్యూలు, బహిరంగ చర్చా కార్యాక్రమాల్లో పాల్గొనరాదని నోటీసులిచ్చింది. సూరత్‌లోని అమ్రోలిలో ఏప్రిల్ 7న జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో వాఘాని ప్రతిపక్ష పార్టీ నాయకులపై అసంబద్ధమైన, ఖండించదగిన వ్యాఖ్యలు చేసినట్టు రుజువయిందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment