ఇక్బాల్ మిర్చి ( ఫైల్ ఫొటో)
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు ఇక్బాల్ మిర్చి హవాలా సొమ్ముపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. ఈ విషయమై ఈడీ ఇప్పటికే అరబ్ ఎమిరేట్స్, యూకేలకు లేఖలు రాసింది. మూడు వేల కోట్ల హవాలా రింగ్గా దీనిని ఈడీ గుర్తించింది. దాంతో రింగ్ వ్యవహారాలు వెలికితీసే పనిలో ఈడీ నిమగ్నమై ఉంది.
1993 ముంబై పేలుళ్ల నిందితుడైన ఇక్బాల్ మిర్చి 2013లో లండన్లో గుండెపోటుతో మృతి చెందాడు. ముంబైలో దావూద్ డ్రగ్ స్మగ్లింగ్ వ్యవహారాలు అన్నీ చూసుకునేవాడు.