Iqbal Mirchi
-
వారంతా అవినీతిపరులే.. కేసులు నుండి తప్పించుకోడానికే..
ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్ షిండే ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ పార్టీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ క్రీడా వెనుక అసలు సూత్రధారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా వాళ్లంతా అవినీతిపరులే.. వారిపై ఉన్న నేరాలను మాఫీ చేసినందుకు ప్రధానికి కృతఙ్ఞతలు తెలపాలని అన్నారు. అధికారం కోసం అర్రులు చాచి అజిత్ పవార్ చాలా పెద్ద తప్పు చేశారని, ఈ రహస్య ఒప్పందం మొత్తం ప్రధాని కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్. అజిత్ పవార్, ఛగన్ భుజబల్, హాసన్ ముష్రిఫ్ లతోపాటు మిగిలిన వారిపైన కూడా నేరారోపణలుండటంతో ప్రధాని వారిని బెదిరించి తమ వైపుకు తిప్పుకున్నారని వ్యాఖ్యానించారు. మా పార్టీ నుండి ఫిరాయింపుకు పాల్పడిన వారందరూ ఆర్ధిక నేరాలకు పాల్పడినవారే. కాంగ్రెస్ ఎన్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న అజిత్ పవార్ అప్పట్లో భారీ ఎత్తులో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో భాగస్వామి కాక ఒక్కరోజు ముందు అవినీతి నిరోధక శాఖ ఆయనపై కేసులు ఎత్తివేసిందని శరద్ పవార్ తెలిపారు. ఆయనలాగే ఇరిగేషన్ స్కాములో అదితి తాత్కారే తండ్రి సునీల్ తాత్కారే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పీడబ్ల్యుడి మంత్రిగా ఉన్నప్పుడు ఛగన్ భుజబల్ కూడా భారీస్థాయిలో మనీలాండరింగ్ చేసి 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు. ఇక హాసన్ ముఫ్రి విషయానికి వస్తే తన సొంత కంపెనీ కోసం నిధులు మళ్లించిన కేసులో ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్టు కాకుండా తప్పించుకున్నారు.. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు ఇక్బాల్ మీమన్ అలియాస్ మిర్చితో వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈడీ కేసును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీళ్లంతా నేరస్తులు కాబట్టే ప్రధాని పని సులువైందని ఆరోపించారు ఎన్సీపీ అధినేత. మా పార్టీని విడిచి వెళ్లిన వారిని వదలబోమని పార్టీ విధానాలను అనుసరించి వారిపై రాజ్యాంగబద్ధమైన చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు. ఇది కూడా చదవండి: అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్ -
అమితాబ్ టు ఐశ్వర్య.. నల్లడబ్బు గుట్టురట్టు!
జెనీవాలోని హెచ్ఎస్బీసీలో 1100 మంది భారతీయులకు రహస్య ఖాతాలు ఉన్నట్టు గత ఏడాది లీకైన స్వీస్ పత్రాలు వెల్లడించి, సంచలనం సృష్టించగా తాజాగా వెల్లడైన పనామా పత్రాలు పెనుదుమారం రేపుతున్నాయి. దాదాపు 500 మంది భారతీయుల పేర్లు ఈ పత్రాల్లో ఉన్నాయి. వారు పన్ను ఎగ్గొటి తమ నల్లడబ్బును దాచుకునేందుకు విదేశాల్లో బూటకపు కంపెనీలు, ఫౌండేషన్లు, ట్రస్టులు ఏర్పాటుచేసినట్టు వెల్లడైంది. నల్లడబ్బుకు స్వర్గధామమైన పనామాలోని మొసాక్ ఫొన్సెకాకు చెందిన కోటి11 లక్షల పత్రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు ఏర్పాటు చేయడంలో దిట్టగా పేరొందిన ఈ లా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. నల్లడబ్బు సర్గధామలైన దేశాల్లో కంపెనీలు స్థాపించి.. తద్వారా పన్ను ఎగ్గొట్టేందుకు ఈ కంపెనీకి పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు డబ్బు చెల్లించినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. ఇందులో 500 మంది భారతీయుల పేర్లు ఉండగా, 234 మంది భారతీయులు ఈ కంపెనీల ఏర్పాటు కోసం తమ పాస్‌పోర్టులను కూడా సమర్పించినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఈ పత్రాలను పరిశీలించి వెల్లడించింది. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్యర్యరాయ్ తోపాటు, డీఎల్ఎఫ్ ప్రమోటర్ కేపీ సింగ్, ఇండియా బుల్స్ యజమాని సమీర్ గుప్తా, ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ పెద్ద సోదరుడు వినోద్ అదానీ, పశ్చిమ బెంగాల్ రాజకీయ నేత శిశిర్ బజోరా, ఢిల్లీ లోక్‌సత్తా చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్ తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం కలకలం రేపుతోంది. అలాగే ముంబై గ్యాంగ్‌స్టర్ ఇక్బాల్ మిర్చితోపాటు పంచుకులా, డెహ్రాడూన్, వడోదర, మంద్‌సౌర్‌కు చెందిన పలువురు పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఐశ్వర్యరాయ్.. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌లోని కంపెనీ ఐశ్యర్య రాయ్, ఆమె తండ్రి రమణరాజ్ కృష్ణరాయ్, తల్లి విందాకృష్ణ రాజ్ రాయ్, సోదరుడు ఆదిత్య రాయ్ డైరెక్టర్లుగా 2005లో ఎమిక్ పార్టనర్స్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటైంది. మొదట ఈ కంపెనీకి ఐశ్యర్య డైరెక్టర్‌గా ఉండగా, తర్వాత షేర్ హోల్డర్‌గా మారిపోయారు. 2008లో ఈ కంపెనీ రద్దయింది. అమితాబ్.. బహమస్ కంపెనీలు కనీసం విదేశీ నాలుగు షిప్పింగ్ కంపెనీల్లో అమితాబ్ బచ్చన్ డైరెక్టర్‌గా ఉన్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. ఇందులో ఒకటి బీవీఐలో ఉండగా, మరో మూడు బహమస్‌లో ఉన్నట్టు తేలింది. 1993లో స్థాపించిన ఈ కంపెనీల మూలధనం కేవలం 5వేల నుంచి 50వేల డాలర్లు కాగా, ఇవి చేసే ఓడల వ్యాపారం కోట్ల డాలర్లలో ఉండేది. -
దావూద్ అనుచరుడి హవాలా సొమ్ముపై ఈడీ దృష్టి
న్యూఢిల్లీ: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు ఇక్బాల్ మిర్చి హవాలా సొమ్ముపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దృష్టి సారించింది. ఈ విషయమై ఈడీ ఇప్పటికే అరబ్ ఎమిరేట్స్, యూకేలకు లేఖలు రాసింది. మూడు వేల కోట్ల హవాలా రింగ్‌గా దీనిని ఈడీ గుర్తించింది. దాంతో రింగ్ వ్యవహారాలు వెలికితీసే పనిలో ఈడీ నిమగ్నమై ఉంది. 1993 ముంబై పేలుళ్ల నిందితుడైన ఇక్బాల్ మిర్చి 2013లో లండన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. ముంబైలో దావూద్ డ్రగ్ స్మగ్లింగ్ వ్యవహారాలు అన్నీ చూసుకునేవాడు.