కోల్ కతా: హవాలా ద్వారా కోటి రూపాయలు లంచం స్వీకరించారనే ఆరోపణలపై కోల్ కతా సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ కమిషనర్ ఏఎమ్ సహాయ్ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈకేసులో భాగంగా సీబీఐ నిర్వహించిన ఆపరేషన్ లో ప్రతీక్ భలోటియా, ఆర్ భలోటియా, సందీప్, జస్రాజ్ లను కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసులో కమిషనర్ అత్యంత సన్నిహితురాల్ని కూడా విచారిస్తున్నట్టు తెలిసింది. ఓ ఎక్సైజ్ కేసులో ముంబైకి చెందిన కంపెనీ నుంచి 1.10 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు సీబీఐకి సమాచారం అందడంతో విచారణ వేగం వంతం చేసి నిందితులను అరెస్ట్ చేశారు.