కదిలే వాహనం నుంచి దిగితే పడతామా..?
న్యూటన్ మొదటి సూత్రం ప్రకారం చలనంలో ఉన్న వస్తువు చలన జడత్వాన్ని, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల జడత్వాన్ని కలిగి ఉంటారుు. జడత్వం అంటే వస్తువు తనంతట తానే తన స్థితిని మార్చకోలేకపోవటం. అంటే కదిలే బస్సుకు ఎంత వేగం ఉంటుందో, బస్సులోని వ్యక్తికీ అంతే వేగం ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి కదిలే బస్సులో నుంచి ఒక్కసారిగా కిందకు దిగితే పడిపోతాడు. దీనికి కారణం బస్సులో నుంచి దిగగానే అతని దిశ బస్సు ప్రయాణించే దిశలో ఉండటం.
పైగా అతని వేగం బస్సు వేగంతో సమానంగా ఉండటమే. ఇందువల్ల తన చలన జడత్వాన్ని, దిశా జడత్వాన్ని అధిగమించటం కోసం బస్సు నుంచి దిగిన వ్యక్తి తన క్షేమం కోసం బస్సు ప్రయాణించే దిశలో కొన్ని సెకన్లపాటు పరుగెత్తాల్సిందే. అలా కాకుంటే ప్రమాదానికి గురికాక తప్పదు. అందుకే కదిలే వాహనాల నుంచి దిగరాదని హెచ్చరిస్తుంటారు.