ఈ కాఫీ రుచే వేరు | Famous Coffee in Tamil Nadu Coffee Shop | Sakshi
Sakshi News home page

ఈ కాఫీ రుచే వేరు

Published Sat, Jun 8 2019 7:09 AM | Last Updated on Sat, Jun 8 2019 7:09 AM

Famous Coffee in Tamil Nadu Coffee Shop - Sakshi

కాఫీ వేస్తున్న మాణిక్యం. (ఇన్‌సెట్‌) ఐదు పొరలుగా ఉన్న కాఫీ

అన్నానగర్‌: ఒకే గ్లాస్‌లో ఐదు రకాలుగా కాఫీ అందిస్తూ టీ మాస్టర్‌ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాడు. కోవై తుడియలూర్‌ సమీపం కనువాడైకి చెందిన మాణిక్యం (56). ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇతడు అక్కడున్న టీ దుకాణంలో పని చేస్తూ ఒకే గ్లాస్‌లో ఐదు రకాలుగా కాఫీ పెట్టే నైపుణ్యం సంపాదించాడు. దీనిని చాలా మంది ఇష్టపడి తాగుతుండడంతో అనంతరం సొంతంగా తుడియలూర్‌ సమీపం కనువాయిలో టీ దుకాణం ప్రారంభించాడు. ఒకే గ్లాస్‌లో టీ, పాలు, బూస్ట్, హార్లిక్స్, బ్లాక్‌ కాఫీ ఈ ఐదు రకాలతో ఒకదానిపై ఒకటి పొరలుగా ఉంటూ సువాసన కలిగిఉండడంతో ఇతని కాఫీకి డిమాండ్‌ అమాంతం పెరిగింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వెతుక్కుంటూ వచ్చి మరీ కాఫీ తాగుతున్నారని మాణిక్యం సంతోషంవ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement