వ్యభిచార కేంద్రానికి విద్యార్థినులు | Female students center of the prostitution | Sakshi
Sakshi News home page

వ్యభిచార కేంద్రానికి విద్యార్థినులు

Published Thu, Aug 7 2014 12:35 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

Female students center of the prostitution

ఐదుగురి అరెస్ట్
టీ.నగర్: విరుదాచలం సమీపంలోగల దిట్టకుడికి చెందిన పాఠశాల విద్యార్థినులను వ్యభిచార కేంద్రానికి తరలించేందుకు ప్రయత్నించిన ఐదుగురిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన బాలికలు ఇద్దరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 7వ తరగతి, 9వ తరగతి చదువుతున్నారు. గత నెల 11వ తేదీ వీరిరువురు పాఠశాల నుంచి ఇంటికి చేరుకోలేదు. వీరి గురించి విద్యార్థినుల తల్లిదండ్రులు దిట్టకుడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసు లు విద్యార్థినుల కోసం గాలిస్తూ వచ్చారు. విద్యార్థినులను సెల్‌ఫోన్‌లో సంప్రదించగా తిరుపూరులో బనియన్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపారు.

దీంతో ఎస్‌ఐ రంగనాథన్, ప్రతాపన్ ఆధ్వర్యంలోని పోలీసులు తిరుపూరులో గాలించినప్పటికీ ఆచూకి తెలియలేదు. విద్యార్థినుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు విరుదాచలం, పుదుచ్చేరి, కోవియనూరు, వడలూరు ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు తెలిసింది. చివరిగా వడలూరులో ఉన్నట్లు వారి వద్ద ఫోన్‌లో మాట్లాడింది వడలూరుకు చెందిన సతీష్‌కుమార్ అని తెలిసింది. వెంటనే సతీష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆ తరువాత విద్యార్థినులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కడలూరు ఏడీఎస్పీ అరులై ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరిపారు. విచారణలో ఇద్దరు విద్యార్థినులకు దిట్టకుడి ఫాదర్ అరుల్‌దాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఆయన వీరిపై లైంగికదాడికి పాల్పడుతూ వచ్చాడు. దీంతో దిట్టకుడి పెరియార్‌నగర్‌కు చెందిన లక్ష్మి విద్యార్థినులను బెదిరించి దిట్టకుడికి చెందిన కొందరికి వీరిని అప్పగించిం ది. ఆ తరువాత వీరిని విరుదాచలంకు చెందిన కళ అనే మహిళకు 5 వేలకు లక్ష్మి విక్రయించింది. విద్యార్థినులను రెండు రోజుల పాటు ఉంచుకున్న కళ అదే ప్రాంతానికి చెందిన జెమీనా అనే మహిళకు 25వేలకు విక్రయించింది. జెమీనా వడలూరులో వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్న సతీష్‌కుమార్‌కు 25వేలకు విక్రయించింది.

దీంతో విద్యార్థినులను పుదుచ్చేరి, బిలియనూరు, విల్లుపు రం, వడలూరు ప్రాంతాల్లో ఉన్న లాడ్జీలలో విద్యార్థులను ఉంచి వారిని సతీష్‌కుమార్ వ్యభిచార వృత్తిలోకి దించాడు. దీంతో ఫాదర్ అరుల్‌దాస్ (60), సతీష్‌కుమార్(28), లక్ష్మీ అలి యాస్ ధనలక్ష్మి(30), విరుదాచలం కళ(48), జెమినా(28)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని దిట్టకుడి మెజిస్ట్రేట్ ఉత్తమరాజ్ ఇంటికి మంగళవారం రాత్రి 11 గంటలకు పోలీసు లు తీసుకెళ్లి హాజరు పరిచారు. వీరిని రిమాండ్‌లో ఉంచేందుకు ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. విద్యార్థినులను మెజిస్ట్రేట్ ఉత్తర్వుల మేరకు కడలూరు జువైనల్ హోంలో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement