బరంపూర్: నోరు పారేసుకుని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బుక్కయ్యాడు. జిల్లా కలెక్టరేట్ను ఉద్దేశించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ చౌదరీ ముర్షిదాబాద్ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆ జిల్లా మేజిస్ట్రేట్ను అభ్యంతరకరంగా తిట్టాడు. దీంతో ఆయనపై గత రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.
జిల్లా మేజిస్ట్రేట్ వై రతన్కర్రావు అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నేతలను, కార్యకర్తలను, ఇతర పార్టీలకు చెందిన వారిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. అనంతరం కొంచె దురుసు పదాలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నోరు పారేసుకుని కాంగ్రెస్ నేత బుక్కు
Published Wed, Nov 16 2016 1:15 PM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement
Advertisement