Adhir Chowdhury
-
క్రికెటర్‌పై పోటీ.. అభ్యర్థికి మహిళల చందాలు
కోల్‌కతా: ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థికి గ్రామీణ మహిళలు చందాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన పదకొండు మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్, 1999 నుండి బెర్హంపూర్ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అధిర్ రంజన్ చౌదరికి ఎన్నికల ప్రచారం కోసం రూ.11,000 విరాళంగా అందించారు. అభ్యర్థికి మహిళలు చందాలు ఇస్తున్న వీడియోను వార్తా సంస్థ ఏఎన్ఐ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ముర్షిదాబాద్ జిల్లాలోని రణగ్రామ్ గ్రామానికి చెందిన మహిళలు వ్యవసాయ కూలి పనులు, మేకల పెంపకం, రోజువారీ కూలి పనుల ద్వారా సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పోగు చేసుకుని కాంగ్రెస్ అభ్యర్థికి విరాళంగా అందించారు. దీంతో ఆ మహిళలకు అధిర్ రంజన్ చౌదరి భావోద్వేగంతో కృతజ్ఞతలు తెలిపారు. బెర్హంపూర్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను పోటీకి దించింది. డాక్టర్ నిర్మల్ సాహా బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. వీరితో అధిర్ రంజన్ చౌదరి తలపడుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో తృణమూల్ 22 సీట్లు గెలుచుకోగా, బీజేపీకి 18 సీట్లు వచ్చాయి. బెర్హంపూర్, మల్దహా దక్షిణ్‌తో సహా కాంగ్రెస్ రెండు స్థానాలను కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ఏడు దశల్లో జరగనునన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న ముగుస్తాయి. మొత్తం 543 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. 42 పార్లమెంటరీ సెగ్మెంట్లు ఉన్న పశ్చిమ బెంగాల్లో అన్ని దశల్లో పోలింగ్ జరుగుతుంది. #WATCH | Murshidabad, West Bengal: 11 women of Kandi town's Ranagram village handed over a total of Rs 11,000 to Congress' Behrampore Lok Sabha candidate Adhir Ranjan Chowdhury to help him in the Lok Sabha elections. The women collected the money from their household expenses,… pic.twitter.com/5QRnjldaUG — ANI (@ANI) April 7, 2024 -
రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం: అధీర్ చౌదరి
పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు 'అధీర్ చౌదరి' ఎన్నికల ప్రచారానికి ప్రధాని 'నరేంద్ర మోదీ' తరచూ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి సరైన మద్దతు ఉంటే ఇన్ని సార్లు రావలసిన అవసరం లేదని పేర్కొన్నారు. మోదీ సిలిగురి పర్యటనకు ముందు తన లోక్‌సభ నియోజకవర్గం బెర్హంపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చౌదరి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో బీజేపీ సరిగ్గా ఉంటే.. బెంగాల్లో ప్రధాని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) నినాదాన్ని మోదీ నిజంగా విశ్వసిస్తే.. రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వాములు మధ్య ప్రాధమిక చర్చలు జరిగాయని చౌదరి అంగీకరించారు. సీట్ల పంపకానికి సంబంధించి విషయాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు, దీనికోసం ఎలాంటి హడావుడి లేదని చెబుతూ.. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైందని చౌదరి స్పష్టం చేశారు. -
బీజేపీ, టీఎంసీలను ఓడించాలి
కోల్‌కతా: లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సంయుక్తంగా ఆదివారం కోల్‌కతాలో నిర్వహించిన భారీ ర్యాలీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. మతతత్వ ప్రభుత్వాలను ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రజలకు జనహిత సర్కారును అందిస్తామని హామీ ఇచ్చాయి. రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి, ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నాయి. ఈ ఎన్నికలు టీఎంసీ, బీజేపీల మధ్య పోటీ మాత్రమే కాదని, మూడో పక్షంగా తమ కూటమి కూడా బరిలో ఉందని కాంగ్రెస్ నేత ఆధిర్ చౌధురి పేర్కొన్నారు. బీజేపీ, టీఎంసీలను ఓడించి తీరుతామన్నారు. మరోవైపు, ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఎన్నికల తరువాత టీఎంసీ జీరో అవుతుందని ఐఎస్ఎఫ్ చీఫ్ అబ్బాస్ సిద్దిఖీ వ్యాఖ్యానించారు. కూటమిలో సీట్ల పంపకాలను ఉద్దేశిస్తూ.. ఐఎస్ఎఫ్ న్యాయబద్ధ వాటా సాధిస్తుందని కాంగ్రెస్, వామపక్షాలను పరోక్షంగా హెచ్చరించారు. ‘బీజేపీ, టీఎంసీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు. మతపరంగా ప్రజలను విడదీయడమే వాటి లక్ష్యం. ప్రజలకు అభివృద్ధిదాయక పాలన మా కూటమే అందివ్వగలదు’ అని రాష్ట్ర సీపీఎం కార్యదర్శి సూర్యకాంత మిశ్రా పేర్కొన్నారు. హంగ్ అసెంబ్లీ వస్తే టీఎంసీ బీజేపీతో చేతులు కలిపి ఎన్డీఏలో చేరేందుకు కూడా వెనుకాడరని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఎన్డీఏలో గతంలోనూ టీఎంసీ భాగస్వామిగా ఉందన్న విషయాన్ని ఏచూరి గుర్తు చేశారు. బీజేపీ, టీఎంసీల మధ్య ప్రస్తుతం జరిగేది ఉత్తుత్తి యుద్ధమేనన్నారు. -
‘అఫిడవిట్లో భార్య పేరు ఎందుకు ప్రస్తావించలేదు’
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అపర కాళిలా మారారు. ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మీద వివర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజకీయ ఆరోపణలు దాటి వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బరంపురం కాంగ్రెస్ అభ్యర్థి అధీర్ చౌదరీ మీద వ్యక్తిగత విమర్శలు చేశారు. ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన భార్య పేరు ప్రస్తావించలేదని మమత ఆరోపించారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అతను ఏం చేస్తున్నాడో నాకు అనవసరం. కానీ ఎన్నికల అఫిడవిట్లో అతను తన చనిపోయిన భార్య పేరును ప్రస్తావించలేదు. ఇది వాస్తావాలను దాచి పెట్టడం కాదా’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చౌదరీ రాజకీయంగా నన్ను విమర్శించే అవకాశం లేకే ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడుతన్నారని పేర్కొన్నారు. కానీ ఇలాంటివి చేయడం వల్ల తృణమూల్ విజయం సాధిస్తుంది అనుకుంటే అది కేవలం భ్రమ మాత్రమే అని స్పష్టం చేశారు. అధీర్ చౌదరీ బరంపురం నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి పార్లమెంట్‌కు వెళ్లాడు. ప్రస్తుతం బరంపురంలో విజయం కోసం తృణమూల్ తీవ్రంగా కష్టపడుతోంది. -
నోరు పారేసుకుని కాంగ్రెస్ నేత బుక్కు
బరంపూర్: నోరు పారేసుకుని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత బుక్కయ్యాడు. జిల్లా కలెక్టరేట్‌ను ఉద్దేశించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ చౌదరీ ముర్షిదాబాద్ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఆ జిల్లా మేజిస్ట్రేట్‌ను అభ్యంతరకరంగా తిట్టాడు. దీంతో ఆయనపై గత రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా మేజిస్ట్రేట్ వై రతన్కర్రావు అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా నేతలను, కార్యకర్తలను, ఇతర పార్టీలకు చెందిన వారిని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు. అనంతరం కొంచె దురుసు పదాలు ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.