పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు 'అధీర్ చౌదరి' ఎన్నికల ప్రచారానికి ప్రధాని 'నరేంద్ర మోదీ' తరచూ ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి సరైన మద్దతు ఉంటే ఇన్ని సార్లు రావలసిన అవసరం లేదని పేర్కొన్నారు.
మోదీ సిలిగురి పర్యటనకు ముందు తన లోక్‌సభ నియోజకవర్గం బెర్హంపూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చౌదరి మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో బీజేపీ సరిగ్గా ఉంటే.. బెంగాల్‌లో ప్రధాని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి) నినాదాన్ని మోదీ నిజంగా విశ్వసిస్తే.. రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ, దాని భాగస్వాములు మధ్య ప్రాధమిక చర్చలు జరిగాయని చౌదరి అంగీకరించారు. సీట్ల పంపకానికి సంబంధించి విషయాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు, దీనికోసం ఎలాంటి హడావుడి లేదని చెబుతూ.. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమైందని చౌదరి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment