సిమ్లా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు కొట్టుకుపోయారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాకు సమీపంలోని గవల్ది గ్రామంలో చోటుచేసుకుంది. నేపాలీ కుటుంబంలో 12 ఏళ్ల దివ్యాంగ బాలుడు మాత్రం యాదృచ్చికంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారీ వరదలకు ఇంటితో సహా కుటుంబంలోని సభ్యులంతా కొట్టుకుపోయారని, స్థానికుల సహకారంతో మృతదేహాలను వెలికితీసినట్టు సిమ్లా పోలీసు కమిషనర్ తెలిపారు.