సాక్షి, ముంబై: వాషి బ్రిడ్జిపై ఈ నెల 18వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకు భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు. దీనిపై పబ్లిక్ వర్క్స్, ట్రాఫిక్ విభాగాలు సంయుక్తంగా మరమ్మతులు చేపట్టనున్నాయి. ట్రాన్స్‌పోర్ట్ బస్సులు, అత్యవసర వాహనాలు, లైట్ వెహికిల్స్‌కు ఎటువంటి నిషేధం లేదని అధికారి ఒకరు తెలిపారు. అయితే లైట్ వెహికిల్స్ వారు ఐరోలి-ములుండ్ బ్రిడ్జిని ఉపయోగించడం ద్వారా వాషి బ్రిడ్జిపై వాహనాల రద్దీ కొంత మేర తగ్గుతోందని ట్రాఫిక్ విభాగం సూచించింది.
ముంబైలోకి ప్రవేశించే వాహనాల నిమిత్తం ఈ బ్రిడ్జి నార్త్ బౌండ్ దిశను తెరిచి ఉంచుతారని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. కాగా నవీముంబై వెళ్లే వాహనాలు పాత వాషి బ్రిడ్జిని ఉపయోగించాల్సి ఉంటుంది. భారీ వాహనాలను ఠాణే-బేలాపూర్ రోడ్, ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపైకి మళ్లించనున్నారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు వచ్చే వాహనాలకు, అలాగే పుణే నుంచి వచ్చే భారీ వాహనాలకు సైతం ఈ బ్రిడ్జిపై అనుమతిని ఇవ్వడం లేదు.
ఈ వాహనాలు ఠాణే-బేలాపూర్ రోడ్డును ఆశ్రయించాల్సి వస్తుంది. లేదంటే నగరంలోకి ప్రవేశించేందుకు ఐరోలి-ములుండ్ క్రీక్ బ్రిడ్జిను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదే మాదిరిగా ముంబై నుంచి వచ్చే భారీ వాహనాలు పుణే వెళ్లేందుకు కూడా ఇదే మార్గం మీదుగా వెళ్లాల్సి ఉంటుందని అధికారి తెలిపారు.
18 నుంచి భారీ వాహనాలకు నో ఎంట్రీ
Published Sat, Nov 15 2014 11:02 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement