
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాత్మక నాయకత్వంతోనే తన గెలుపు సాధ్యమైందని తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నారు. నిజాయితీతో కష్టించి పనిచేస్తే ఫలితం బీజేపీ సాధించిన అద్భుత విజయమని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తమకు ఎదురైన భారీ ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాని, ప్రధాని నరేంద్ర మోదీని నిందించే బదులు తమ బలాబలాలపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు.
మరోవైపు రానున్న ప్రపంచ కప్‌లో భారత్ గెలుపొందాలని తాను ఆకాంక్షిస్తున్నానని ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న గౌతం గంభీర్ చెప్పుకొచ్చారు. ప్రపంచ కప్‌ను గెలవడంకన్నా క్రికెటర్ జీవితంలో గొప్ప ఆనందం ఏమీ ఉండదని చెప్పారు. 2011లో గెలిచిన భారత్‌కు 2019లోనూ ప్రపంచ కప్ గెలుచుకునే మరో అవకాశం ముందుకొచ్చిందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment