ముంబై: ఓ టీవీ నటిని మోసం చేసి అత్యాచారం చేసిన కేసులో నకిలీ బాబాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. , ఆమెకు 25.70 లక్షల రూపాయిలు టోకరా వేసినట్టు చర్కోప్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆధ్యాత్మిక శక్తులున్నాయని చెప్పుకునే 35 ఏళ్ల ఇస్మాయిల్ ఖాసీం ఖాన్.. తనకు దుష్ట శక్తి ఆవహించిందని చెప్పి, దాన్ని నయం చేయడానికి భారీ మొత్తం తీసుకున్నాడని 27 ఏళ్ల టీవీ నటి ఫిర్యాదు చేసింది.
మానసిక వేధన, శారీరక అలసట నయం చేయించుకునేందుకు గతేడాది భగవాన్ దాస్ అనే వ్యక్తిని ఆశ్రయించానని తెలియజేసింది. అయితే వ్యాధి నయం కాకపోవడంతో భగవాన్ తనను ఇస్మాయిల్కు పరిచయం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. వ్యాధి నయం చేస్తానని చెప్పి తన వద్ద పలు సందర్భాల్లో 25 లక్షలు తీసుకున్నాడని వెల్లడించింది. తాను చెప్పినట్టు చేయాలంటూ శారీరకంగా వేధించాడని, అత్యాచారం చేశాడని టీవీ నటి కేసు పెట్టింది. పోలీసులు ఇస్మాయిల్పై మోసం, అత్యాచారం, భగవాన్పై మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్ను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 16 వరకు పోలీస్ రిమాండ్ విధించారు.
టీవీ నటిపై నకిలీ బాబా అత్యాచారం
Published Tue, May 13 2014 8:26 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM
Advertisement
Advertisement