godman
-
ఆశారాం నుంచి రామ్ రహీం వరకూ ఏం చదువుకున్నారు?
మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ ఆశారాం బాపు: మూడవ తరగతి బాబా రామ్‌దేవ్: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి శ్రీశ్రీ రవిశంకర్: సెంట్ జోసెఫ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ సంత్ రామ్ పాల్: ఇంజినీరింగ్ డిప్లమో జగ్గీవాసుదేవ్(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్ ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? -
హత్య కేసుని ఛేదించడం కోసం బాబా సాయం కోరిన పోలీసులు: వీడియో వైరల్
అధికార హోదాలో ఉన్న పోలీసులే ఓ హత్య కేసు చేధించడం కోసం బాబాని సాయం కోరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్లో చోటు చేసుకుంది. ఈ మేరకు బమిత పోలీస్ స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ శర్మ ఒక మైనర్ హత్య కేసు విషయమై బాబా పండోఖర్ సర్కార్ సాయం తీసుకోవడవం పెద్ద కలకలం రేపింది. అందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో పోలీసు సూపరిండెంట్ సచిన్ శర్మ సదరు అసిస్టెంట్ సీఐ అనిల్ శర్మని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో పంకజ్ శర్మని నియమించారు. అసలేం జరిగిందంటే....జులై 28న ఓటపూర్వ గ్రామంలో బావి నుంచి 17 ఏళ్ల బాలిక మృతదేహం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బాలిక బంధువులు తమ గ్రామస్తులైన రవి అహిర్వార్, గుడ్డా అలియాస్ రాకేష్, అమన్ అహిర్వార్లు ఈ హత్య చేశారని ఆరోపిస్తూ... పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కానీ ఆ తర్వాత తగిన సాక్షాధారాలు లేవంటూ పోలీసులు వారిని వదిలేశారు. అకస్మాత్తుగా కొద్ది రోజుల తర్వాత పోలీసులు విచారణలో ఆ బాలిక మేనమామ తిరత్ అహిర్వారే ఈ హత్య చేసినట్లు చెప్పారు. తన మేనకోడలు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఈ హత్యచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో బాలిక బంధువులు ఒక్కసారిగా నిర్ఢాంతపోయారు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు విషయమై బాబాను సాయం కోరిన వీడియో లీక్ అవ్వడంతో వివాదస్పదమైంది. అంతేకాదు వీడియోలో బాబా.. నిందితుడు మజ్గువాన్ ప్రాంతానికి చెందినవాడని, అతనే ఈ కేసులో కీలక నేరస్తుడని చెప్పడం విశేషం. దీంతో అధికారులు ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా తదుపరి విచారణ బాధ్యతలను సబ్ డివిజనల్ పోలీసు అధికారి మన్మోహన్ సింగ్ బఘెల్‌కు అప్పగించారు. In a bid to identify the suspect in the death of a 17-year-old girl,ASI Anil Sharma from Chhatarpur reached out to Pandokhar Sarkar, he could be heard saying he has called out the names of a few people the name he missed will lead them to the suspect @ndtv @ndtvindia pic.twitter.com/u2RrpaLuYG — Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2022 (చదవండి: బావ అధికారిక సమావేశంలో బావమరిది హాజరు...వివాదంలో లాలు ప్రసాద్ కుటుంబం -
భక్తురాలిపై అఘాయిత్యం... దేవతే అలా చేసిందని బుకాయింపు
ఇటీవల కాలంలో స్వామిజీ పేరుతో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అయినా ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు. ఈ డిజిటల్ యుగంలో పిచ్చి బాబాలు, స్వామీజీల మాయలో పడి కోరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ స్వామీజీని నమ్మీ జీవితాన్ని నాశనం చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మధ్యప్రధేశ్లో ఒక వ్యక్తి తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది. సదరు మహిళ ఆ ప్రసాదం తిని స్ప్రుహ కోల్పోయాననని, ఆ తర్వాత ఆ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని వాపోయింది. ఆ బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండ ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్ నాయకుడి గెలుపు కోసం యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు. ఆ వ్యక్తికి సమాజంలో కాస్త పలుకుబడి ఉండడంతో భయప్డడానని చెప్పుకొచ్చింది సదరు బాధితరాలు. ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం') -
ఎన్ని ఆస్పత్రులు తిరిగినా లాభం లేదు.. చివరగా
బెంగుళూరు: మూఢనమ్మకం ఓ మహిళ ప్రాణాలు తీసింది. అల్లోపతి వైద్యంతో ఫలితం లేదని భూత వైద్యుడిని సంప్రదిస్తే ఆ అభాగ్యురాలి ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ విషాదకర ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతురాలి కూతురు తెలిపిన వివరాల ప్రకారం.. గౌడరహళ్లికి చెందిన పార్వతి (37) గత రెండు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చెకప్‌లు కూడా చేయించుకుంది. అయితే, ఆమెకు అంతా బాగానే ఉందని, ఎటువంటి సమస్యలు లేవని వైద్యులు చెప్పారు. కానీ, పార్వతి తలనొప్పి మాత్రం తగ్గలేదు. చివరగా బంధువుల సూచన మేరకు డిసెంబర్ 2న ఆమెను కుటుంబ సభ్యులు మను అనే భూత వైద్యునికి వద్దకు తీసుకెళ్లారు. బెక్క గ్రామంలో నివసించే మను ఓ నిమ్మకాయ ఇచ్చి కొద్ది రోజుల తర్వాత రమ్మన్నాడు. (చదవండి: గతంలో కోవిడ్.. తాజాగా డెంగ్యూ.. బీజేపీ మహిళా ఎమ్మెల్యే మృతి) అతను చెప్పిన ప్రకారం డిసెంబర్ 7న బాధితురాలిని అక్కడకు మరోసారి తీసుకెళ్లారు. తలనొప్పిని తగ్గిస్తానని చెప్పి మను పార్వతి తలపై, ఒంటిపై కర్రతో విపరీతంగా బాదాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను చెన్నరాయపట్నంలోని ప్రభుత్వం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: West Bengal: ఆహా ఏమి అదృష్టం! ఉదయం కొన్నాడు.. సాయంత్రానికి జాక్‌పాట్ కొట్టాడు!!) -
నా బ్యాంక్.. నా ఇష్టం
-
సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!
న్యూఢిల్లీ: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరో సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచారు. తన దేశం ‘కైలాస’లో రిజర్వ్ బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా.. ఈ కరెన్సీ చెల్లుబాటయ్యేలా ఇందుకు సంబంధించి వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఆగష్టు 22న హిందూ రిజర్వ్ బ్యాంకును స్థాపించడం సహా అదే రోజు నుంచి కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు అన్నీ పూర్తి చేశామని, పాలసీ డాక్యుమెంట్లు సిద్ధమయ్యాయని, చట్టబద్ధంగానే ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. (ఆ అక్కాచెల్లెళ్లు నిత్యానంద ‘కైలాస’లో..) ఈ మేరకు పలు దేశాలతో ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నామని... ప్రపంచ దేశాల నుంచి విరాళాల రూపంలో వస్తున్న డబ్బును ఆర్గనైజ్ చేసి(వ్యవస్థీకృతం) లావాదేవీలు కొనసాగించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో నిత్యానంద ఫొటోలతో ముద్రితమైనట్లుగా ఉన్న కరెన్సీ నోట్ల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా కర్ణాటక, గుజరాత్‌లలో ఆశ్రమాలు స్థాపించి ఆధ్మాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన నిత్యానంద దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి, దానికి ‘కైలాస’ అనే పేరు కూడా పెట్టినట్లు తన వెబ్సైట్ ద్వారా వెల్లడించారు. అంతేగాక తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని డిజైన్ చేసినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా ప్రధాన మంత్రిని, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈక్వెడార్ మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది. దీంతో నిత్యానంద ఆచూకీ కోసం అంతర్జాతీయ పోలీస్ సంస్థ ఇంటర్‌పోల్ ఫిబ్రవరిలో బ్లూకార్నర్ నోటీస్ జారీ చేసింది. ఇక ఇప్పుడు సొంతంగా బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -
ఇంతకూ నిత్యానంద కథేంటి?
జంతువులతో మాట్లాడిస్తానన్నాడు. ఏలియన్స్‌తో ముచ్చట్లు పెట్టానని కోతలు కోశాడు! తిక్కరేగి ఓసారి.. సూర్యోదయాన్ని కూడా ఆపేశానంటూ భక్తులకు గుండెపోటు తెప్పించాడు. ఆ మాటకొస్తే తనను మించిన భగవంతుడే లేడని చెప్పుకున్నాడు నిత్యానంద. కట్ చేస్తే..దేశం విడిచి పరారయ్యాడు. ఇంతకూ నిత్యానంద కథేంటి..? వేలసంఖ్యలోఅనుచర గణాన్ని పోగేసుకున్న నిత్యానందకు.. దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం ఏం వచ్చింది? వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద గుట్టుచప్పుడు కాకుండా కొన్ని నెలల మందే దేశం నుంచి జంపయ్యాడు. గుజరాత్ పోలీసులు అతగాడిపై కేసు రిజిస్టర్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. అనేక వివాదాలతో పలుమార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద..తమిళనాడులోని బిడిదితో పాటు అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు. ఈ కంప్లైంట్ గుజరాత్ హైకోర్టు వరకూ వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. గుజరాత్లో ఆశ్రమాన్ని నిర్వహిస్తోన్న సాధ్వీ ప్రాణ ప్రియానంద, ప్రియతత్వ రిధ్వి కిరణ్ అనే ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు..అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. నిత్యానంద ఆశ్రమంలోనుండి బయట పడ్డ 15 ఏళ్ల బాలిక అక్కడ జరుగుతున్న అరాచకాలను వివరించింది. నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవారని చెప్పుకొచ్చింది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు తమతో ప్రమోషనల్ వీడియోలు చేయించేవారని..మాట వినకపోతే చిత్రహింసలు పెట్టేవారని వివరించింది. నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది. అప్పట్నుంచే నిత్యానంద బైట కన్పించడం లేదు. మరోవైపు గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయాడు. 2010 నటి రంజితతో సరసాల వీడియో బయటకు వచ్చిన తర్వాత పరువు పోగొట్టుకున్నాడు నిత్యానంద. ఈ కేసులో నిత్యానందను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల తర్వాత బెయిలుపై బయటకు వచ్చాడు. ఆ తర్వాత కూడా అనేకమార్లు వార్తల్లో నిలిచాడు. జంతువులకు తమిళ్, సంస్కృతంలో మాట్లాడేలా ట్రైనింగ్ ఇస్తా అంటూఆ మధ్య సవాల్ కూడా విసిరాడు నిత్యానంద. అందుకోసం ఐన్ స్టీన్ ఫేమస్ సూత్రం E= MC 2 ఉపయోగపడుతుందంటూ లాజిక్ లేని మ్యాజిక్ కబుర్లు చెప్పాడు. సూర్యుడిని 40 నిమిషాలు ఉదయించకుండా ఆపానని కూడా ఓసారి చెప్పుకొచ్చాడు ఈ నిత్యానందుడు. శాస్త్రవేత్తలు అంగారకుడిపై జీవం కోసం ఇప్పటికీ వెతుకుతుంటే..చాలా ఏళ్ల క్రితమే చాలా గ్రహాలపై జీవం ఉందని నిత్యానంద చెప్పేశాడు. అక్కడి నుంచి వారు ఎడ్యుకేషనల్ టూర్ కోసం భూమిపైకి వస్తుంటారని..వాళ్లతో చాలాసార్లు మాట్లాడనంటూ భక్తుల చెవిలో పువ్వులు పెట్టాడు నిత్యానంద. ఇలా నిత్యనంద వాదనలు, ప్రవచనాల లిస్టు చాలా పెద్దదే. అయితే, నిత్యానందను నమ్మేవారి సంఖ్య ఇప్పటికీ వేల సంఖ్యలో ఉంది.మనదేశంతో పాటు విదేశాల్లో కూడా ఇతగాడికి భక్తులు ఉన్నారు. తమిళనాడులో పుట్టిన నిత్యానంద..తనను తాను భగవంతుడిగా చెప్పుకుంటాడు.ఇక ఆశ్రమాల్లో ఇతడు చేసే డ్యాన్సులకు, వింతవింత చేస్టలకైతే కొదవేలేదు. వరుస వివాదాలు, అరెస్ట్ భయంతో దేశం విడిచిపోవాలని నిత్యానంద ఎప్పటినుండో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.చిత్రమేంటంటే.. నిత్యానంద పాస్‌పోర్ట్ 2018 సెప్టెంబర్‌లోనే గడువు తీరిపోయింది. అది తిరిగి రెన్యువల్ కాలేదు. అలాంటి వ్యక్తి విదేశాలకు ఎలా పారిపోయారన్నది తేలాల్సి ఉంది. చేతులు కాలాకా ఇప్పుడు తీరిగ్గా ఆకులు పట్టుకున్న కేంద్ర విదేశాంగ శాఖ ఆయన్ని తిరిగి భారత్ రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అది ఎంతవరకూ సక్సెస్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. -
అనూహ్యం.. కోసేసుకున్న బాబా
జైపూర్: రాజస్థాన్‌లోని చురూ జిల్లా తారానగర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ బాబా(30) జననాంగాన్ని కోసేసుకున్నారు. స్థానికంగా ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇరుగుపొరుగు వారు ఆరోపించిడంతో సంతోష్ దాస్‌కు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తారానగర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బికనేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. స్థానికలంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుడి నుంచి ఇంకా వాంగ్మూలం తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు ఒత్తిడి తేవడంతో అతడు ఈ చర్యకు ఒడిగట్టాడని తెలిపారు. అతడికి బుద్ధి చెప్పేందుకు స్థానికులే ఈ చర్యకు పాల్పడినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. వీటిలో వాస్తవముందో, లేదో చూడాల్సివుందని పోలీసులు అన్నారు. -
15 రోజుల సమాధి తర్వాత ..
పట్నా: పదిహేను రోజుల సమాధి తర్వాత ఓ బాబా ఆరోగ్యంగా బయటికి వచ్చాడన్న వార్త బిహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. బిహార్‌లోని మాధేపురా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 అడుగుల లోతైన గొయ్యిలోకి 15 రోజుల తర్వాత ప్రమోద్ బాబా సురక్షితంగా బయటకు వచ్చిఆశ్చర్యపరిచాడని భక్తులు చెప్పారు. గ్రామస్తులు అందించిన వివరాల ప్రకారం చౌసా పోలీసు స్టేషన్ పరిధిలోని భట్కాగా గ్రామంలో గత ఫిబ్రవరి 28 న సమాధి చేసుకున్నాడు. సుమారు 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతు తవ్విన గుంతలో మంచం మీద కూర్చున్న స్థితిలో బాబా సమాధిలోకి వెళ్లాడని బాబా భక్తులు చెప్పారు. అనంతరం ఆగుంతపై గుడ్డతో కప్పిం వుంచామన్నారు. విషయం తెలుసుకున్న తెలుసున్న కొంతమంది జిల్లా ఉన్నతాధికారులు, డాక్లర్ల బృందం అక్కడికి చేరుకుని, బాబాను వారించాలని చూసింది. కానీ బాబా సాధనకు అడ్డురావద్దని గ్రామస్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుతిరిగారని గ్రామస్తులు చెప్పారు. అయితే బాబా ఆరోగ్యంగా ఉన్నాడని మధేపురా జిల్లా ఎస్పీ వికాస్ కుమార్ ఆదివారం మీడియాకు తెలిపారు. బాబా ఆరోగ్యం ఉన్నాడని నిలకడగా ఉందన్నారు. ప్రముఖ డాక్టర్లతో ఆయనను పరిశీలించినట్టు తెలిపారు. అయితే ఆయన సమాధి గురించ తమకు తెలియదని పేర్కొనడం విశేషం. -
తిండి, గాలి, నీళ్లు లేకుండా 15 రోజులు బతికాడు!!
పట్నా: మనదేశంలో బాబాలు చాలా విన్యాసాలు చేస్తుంటారు. కొందరు గాలిలో విభూది ఉండలు, రుద్రాక్ష మాలాలు సృష్టిస్తే.. మరికొందరు నోటినుంచి శివలింగాలు రప్పిస్తూ ఉంటారు. ఈ విన్యాసాల వెనుక నిజమెంత? జిమ్మిక్కు ఎంత? అన్నది ఎప్పుడూ వివాదాస్పద అంశమే. ఇప్పుడు తాజాగా బిహార్‌లో ఓ బాబా కూడా ఇలాంటి విన్యాసమే చేశాడు. ఓ గోతిలో తనను తాను కప్పేసుకొని.. తిండి, నీళ్లు, ఆక్సీజన్ లేకుండా 15 రోజులు గడిపాడు. ఆ తర్వాత ఆ గోతి నుంచి ఎప్పటిలాగే ఆరోగ్యవంతంగా బయటపడ్డాడు. బిహార్ లోని మాధేపురకు చెందిన ప్రమోద్ బాబు ఈ విన్యాసం చేశారు. కప్పివేసిన గోతి నుంచి ఆయన 15 రోజుల తర్వాత వెలికిరావడంతో ఈ బాబాను చూసేందుకు బిహార్ రాష్ట్రమంతటి నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వ్యవహారంతో మీడియాలో ప్రమోద్ బాబా హైలెట్ అయ్యారు. అయితే బాబు విన్యాసంలోని ప్రామాణికతను వైద్యులు, హేతువాదులు ప్రశ్నిస్తున్నారు. 15 రోజులు ఆక్సీజన్ లేకుండా మనుషులు జీవించలేరని, సదరు బాబా చేసిన విన్యాసం వట్టి బూటకమని కొట్టిపారేస్తున్నారు. ఆయన నిజంగా అలా చేయగలిగితే ల్యాబ్‌లో చేసి చూపించాలని సవాల్ విసురుతున్నారు. 'ఆక్సీజన్ లేకుండా మనుషులు బతకడం అసాధ్యం. సైన్స్ ప్రకారం ఇది నమ్మశక్యంకాని విషయం. యోగా, ధ్యానం సాధన ద్వారా శరీర అవసరాలను కొంతమేరకు నియంత్రించవచ్చు కానీ పూర్తిగా వాటి నుంచి వేరయి.. జీవించగలగడం అన్నది అసాధ్యం. అలా చేస్తూ మూడు నిమిషాల్లోనే మెదడుపై ఆ ప్రభావం పడుతుంది' అని ప్రముఖ వైద్యుడు కేకే పాండే తెలిపారు. -
నకిలీ గురువులు
మెహెర్ బాబా ఒక సందర్భంలో నకిలీ గురువులు, సాధువులు గురించి చెబుతూ ఇలా అన్నారు. మార్కెట్లో ఒక్కోసారి కొన్ని వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. గిరాకీకి తగ్గట్టుగా మార్కెట్లో సరుకు లభ్యం కాకపోతే నకిలీ వస్తువులు, నాసిరకం సరుకులు మార్కెట్లో ప్రవే శిస్తాయి. ఫలితంగా కొనుగోలుదారులకు నష్టాలు, రోగాలు. ఈ పరిస్థితి ఆధ్యాత్మిక రంగానికీ వర్తిస్తుంది. ప్రస్తుత కాలంలో భగవత్ భక్తి, ఆధ్యాత్మిక జిజ్ఞాస ప్రజ ల్లో ఎక్కువగా ఉంది. వారికి సరైన మార్గం చూపే సద్గు రువులు, సాధువులు తక్కువగా ఉన్నారు. ఫలితంగా నకిలీ గురువులు, దొంగ సాధువులు పుట్టుకొచ్చి ప్రజల ను మోసం చేస్తూ వారిని కష్టాలకు గురి చేస్తున్నారు. మంచి ముత్యానికి, కృత్రిమ ముత్యానికి మధ్య తేడా ఏమిటో మామూలు మనిషి కనిపెట్టలేడు. ముత్యా ల వర్తకుడికి మాత్రమే అది సాధ్యం. అలాగే సద్గురు వుకూ నకిలీ గురువుకూ మధ్య తేడా మామూలు మనిషి కనిపెట్టలేడు. సద్గురువో, నిజమైన సాధువో ఆ తేడా కని పెట్టగలడు. నకిలీ గురువులు, దొంగ సాధువులు వేదాంత గ్రంథాన్ని లోతుగా కా కుండా పైపైన చదివి మిడిమిడి జ్ఞానం సంపాదించి అలా త యారవుతారు. వేదాంత గ్రంథ పఠనం వల్ల ‘నేను భగవంతు డను, అహం బ్రహ్మాస్మి’ అనటం సులభం. అవతార పురుషుడు, సద్గురువు కూడా ‘నేను భగవంతుడను’ అనే చెబుతారు. అలా చెప్పటం వేదాంత గ్రంథాలు చదవటం వల్ల కా దు, బ్రహ్మ సాక్షాత్కారం పొందినందువల్ల, బ్రహ్మాను భవం కలిగినందువల్ల, బ్రహ్మమే తాము అయినందు వల్ల. ఇలాంటి కపట సన్యాసులు, సాధువులు, గురువులు తమకేగాక చుట్టూ ఉన్న సమాజానికి కూడా హాని చేస్తుంటారు. అలాగే నకిలీ గురువుల మాయలకు వారి శిష్యులు లొంగిపోయి వీరు చేసే చిన్న చిన్న మహత్యాల్ని గొప్పగా చేసి చూపిస్తూ, అతిగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెడుతుంటారు. మహత్యాలన్నీ (మిరకిల్స్) మాయకు సంబంధిం చినవే. నకిలీ గురువులు చేసే మహత్యాలన్నీ మాయలో ఉన్న జనాన్ని ఇంకా మాయలోకి నెడతాయి. సద్గురువు మహత్యాలు చెయ్యడు, చేసినా, జనాన్ని మాయ నుండి బయటకు లాగటానికి మాత్రమే వాటిని చేస్తాడు. సద్గురువులు ఎవరో, నకిలీ గురువులు ఎవరో కనిపెట్టడానికి మెహెర్‌బాబా కొన్ని కొండ గుర్తులు చెప్పినారు. నకిలీ గురువుల చుట్టూ హంగు, ఆర్భాటం ఎక్కువ గా ఉంటుంది. సద్గురువులు వీటికి దూరంగా, సాదా సీదాగా ఉంటారు. నకిలీ గురువుల చుట్టూ ఎంత ఎక్కు వ జనం పోగయితే వారికి అంత గొప్ప. సద్గురు వులు గుంపుకోసం వెంపర్లాడకుండా శిష్యులు, అనుయా యులు కొద్దిమందే అయినా వారిని చేయిపట్టి సన్మార్గం లో నడిపిస్తారు. నకిలీ గురువులు తమ పేరు ప్రతిష్ఠల కోసం, సుఖ సంతోషాల కోసం పాకులాడు తారు. సద్గురువులు ప్రాపంచిక సౌఖ్యాలకు, భోగ భాగ్యాలకు దూరంగాను, భగవంతునికి దగ్గరగాను ఉంటారు. నకిలీ గురువులు ఎప్పుడూ ఏదో ఆందోళనలో మునిగి ఉంటారు. సద్గురువుల చుట్టూ ఆనందం వెల్లివిరిస్తూ ఉంటుంది. సద్గురువులను ఆశ్రయించినవారు ఆ ఆనందంలో పాలుపంచుకుంటారు. - దీవి సుబ్బారావు -
మహిళపై ఆధ్యాత్మిక గురువు అత్యాచార యత్నం:అరెస్ట్
కటక్: మరో ఆధ్యాత్మిక గురువు వివాదంలో చిక్కుకున్నాడు. జైపూర్ జిల్లాలోని ఛండీఖోల్ లో కైబాల్యా ఆశ్రమం నిర్వహిస్తున్న సచిత్రా పరిదా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పూజ చేయాలని ఆ మహిళకు మాయమాటలు చెప్పి లైంగిక చర్యలకు తెరలేపాడు. దీంతో ఆ మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ మహిళ తన భర్తతో కలిసి పరిదాను కలుస్తుండేది. ఈ క్రమంలోనే అతని ప్రవర్తనపై అనుమానం కల్గిన ఆ మహిళ ఆశ్రమానికి వెళ్లడం మానేసింది. అయితే తాజాగా శనివారం పరిదా నుంచి ఆ మహిళకు పిలుపువచ్చింది. తన ఇంటిదగ్గర పూజ చేయాలని ఆ పిలుపులో సారాంశం. ఒకవేళ ఆ పూజ చేయించుకోకపోతే త్వరలోనే నీ భర్త చనిపోతాడంటూ దొంగ స్వామిజీ హెచ్చరించాడు. ఆ స్వామిజీ మాటలతో భయపడిన మహిళ అతని ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో తన భర్తకూడా ఇంటిలో లేకపోవడంతో ఒంటరిగానే అతని వద్దకు వెళ్ళింది. దీన్ని అదునుగా తీసుకున్న స్వామిజీ ఆ మహిళను లైంగికంగా లొంగదీసుకోవాలని యత్నించాడు. దీంతో అసలు విషయాన్నిగ్రహించిన మహిళ అక్కడ ఉన్న అలారాన్ని మోగించడంతో చుట్టుప్రక్కల వారు అక్కడకు చేరుకుని పరిదాను చితకబాదారు. అనంతరం మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ ఐ సుజాతా జెనా స్పష్టం చేశారు. -
టీవీ నటిపై నకిలీ బాబా అత్యాచారం
ముంబై: ఓ టీవీ నటిని మోసం చేసి అత్యాచారం చేసిన కేసులో నకిలీ బాబాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. , ఆమెకు 25.70 లక్షల రూపాయిలు టోకరా వేసినట్టు చర్కోప్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆధ్యాత్మిక శక్తులున్నాయని చెప్పుకునే 35 ఏళ్ల ఇస్మాయిల్ ఖాసీం ఖాన్.. తనకు దుష్ట శక్తి ఆవహించిందని చెప్పి, దాన్ని నయం చేయడానికి భారీ మొత్తం తీసుకున్నాడని 27 ఏళ్ల టీవీ నటి ఫిర్యాదు చేసింది. మానసిక వేధన, శారీరక అలసట నయం చేయించుకునేందుకు గతేడాది భగవాన్ దాస్ అనే వ్యక్తిని ఆశ్రయించానని తెలియజేసింది. అయితే వ్యాధి నయం కాకపోవడంతో భగవాన్ తనను ఇస్మాయిల్‌కు పరిచయం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. వ్యాధి నయం చేస్తానని చెప్పి తన వద్ద పలు సందర్భాల్లో 25 లక్షలు తీసుకున్నాడని వెల్లడించింది. తాను చెప్పినట్టు చేయాలంటూ శారీరకంగా వేధించాడని, అత్యాచారం చేశాడని టీవీ నటి కేసు పెట్టింది. పోలీసులు ఇస్మాయిల్‌పై మోసం, అత్యాచారం, భగవాన్‌పై మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్‌ను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 16 వరకు పోలీస్ రిమాండ్ విధించారు. -
ఉత్తరప్రదేశ్‌లో గోల్డ్ రష్
-
కొత్త పెళ్లికూతురిపై నాలుగు నెలలు అత్యాచారం
మాయలు చేసో, మంత్రాలు చదివో.. అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న బాబాలు, స్వాములకు కొదవ లేని దేశం మనది. సరిగ్గా ఇలాగే చేశాడో పెద్ద మనిషి. ఆయన వయసు 65 ఏళ్లు. తనకు తాను బాబాగా చెప్పుకొంటున్నాడు. 24 ఏళ్ల మహిళను నాలుగు నెలలుగా తన ఆశ్రమంలోనే బంధించి, ఆమెపై ఇన్నాళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపు లీలలు బయట పడిన కొన్నాళ్లకే ఈ విషయం కూడా బయటపడింది. మహేంద్రగిరి అలియాస్ టున్ను బాబా అనే ఈ వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మధ్య ప్రదేశ్‌లోని నీల్ఖండ్ గ్రామంలో అతడి ఆశ్రమంపై దాడులు చేసి, సదరు మహిళను వారు రక్షించారు. ఇందులో విచిత్రం ఏమిటంటే, బాధితురాలి భర్త, అత్త కూడా అదే ఆశ్రమంలో ఉండటమే కాక.. వాళ్లే స్వయంగా ఆమెను టున్ను బాబా వద్దకు పంపేవారట!! ఈ ఘనకార్యానికి పాల్పడినందుకు వారిద్దరినీ కూడా అరెస్టు చేశారు. ఈ సంవత్సరం మే నెలలోనే బాధితురాలికి విశ్రామ్ బంజారా అనే వ్యక్తితో పెళ్లయింది. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమెపై టున్ను బాబా అత్యాచార పర్వం మొదలైంది. దీంతో.. అత్యాచారం, అక్రమ నిర్బంధం, నేరపూరితంగా బెదిరించడం లాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది.