
జైపూర్: రాజస్థాన్‌లోని చురూ జిల్లా తారానగర్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న ఓ బాబా(30) జననాంగాన్ని కోసేసుకున్నారు. స్థానికంగా ఉండే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఇరుగుపొరుగు వారు ఆరోపించిడంతో సంతోష్ దాస్‌కు ఈ చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. తారానగర్‌లో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బికనేర్ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.
స్థానికలంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితుడి నుంచి ఇంకా వాంగ్మూలం తీసుకోలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తమ ఊరి నుంచి వెళ్లిపోవాలని స్థానికులు ఒత్తిడి తేవడంతో అతడు ఈ చర్యకు ఒడిగట్టాడని తెలిపారు. అతడికి బుద్ధి చెప్పేందుకు స్థానికులే ఈ చర్యకు పాల్పడినట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. వీటిలో వాస్తవముందో, లేదో చూడాల్సివుందని పోలీసులు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment