గోరఖ్‌పూర్ ఘటనలో వైద్యులపై ఎఫ్‌ఐఆర్
సాక్షి, లక్నో: గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి బీఆర్‌డీ మెడికల్ కాలేజ్ వైద్యులు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాదారుపై యూపీ ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రదానకార్యదర్శి రాజీవ్ కుమార్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య డైరెక్టర్ జనరల్ కేకే గుప్తాపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
మరోవైపు చిన్నారుల మృతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికలో యూపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అశుతోష్ టాండన్‌పై ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం గమనార్హం. మరోవైపు సస్పెండ్ అయిన బీఆర్‌డీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, లక్నోకు చెందిన లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాదారుపైనా కేసులు నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.