BRD Medical College
-
గోరఖ్‌పూర్ ఘటన: బెయిల్ పిటిషన్ తిరస్కరణ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పూర్ణిమా శుక్లా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది. వారిలో డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ఇటివల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీఆర్డీ మెడికల్ కాలేజీలో హోమియోపతి విభాగానికి చెందిన పూర్ణిమా శుక్లా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా భార్య. ముందస్తు విడుదల కోరుతూ పూర్ణిమా శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి యశ్వంత్ వర్మ విచారించారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
48 గంటల్లో 42మంది మృత్యువాత
-
గోరఖ్‌పూర్‌లో మళ్లీ ఘోరం..
► 48 గంటల్లో 42మంది మృత్యువాత గోరఖ్‌పూర్ : ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌లో బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి (బీఆర్డీ) లో చిన్నారుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. గడిచిన 48 గంటల్లో మరో 42మంది చిన్నారులు మరణించారు. వారిలో ఏడుగురు మెదడువాపు వ్యాధి, మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని ఆస్పత్రి ప్రిన్సిపల్ పీకే సింగ్ వెల్లడించారు. కాగా ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకూ 290మంది పిల్లలు మరణించారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి 1,250మంది చిన్నారులు మృతి చెందారని, వారిలో 175మంది మెదడువాపు వ్యాధితో మరణించినట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్డీ ఆస్పత్రి దుర్ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ విచారణకు ఆదేశిస్తూ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ మిశ్రాను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మిశ్రాతో పాటు ఆయన భార్యను స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసింది. కాగా గోరఖ్‌పూర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు... తమ పిల్లల ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వస్తారని, దాని వల్ల తాము చిన్నారులకు తమ శాయశక్తులా చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆస్పత్రి వైద్యుడు ఒకరు తెలిపారు. అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది చిన్నారుల మరణాలు తక్కువ అని అన్నారు. ఈ విషయాన్ని మీడియా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. గత నెలలో బీఆర్డీ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక చనిపోయిన వారిలో చాలా మంది నవజాత శిశువులు ఉన్న విషయం విదితమే. -
గోరఖ్‌పూర్ ఘటనలో వైద్యులపై ఎఫ్ఐఆర్
సాక్షి, లక్నో: గోరఖ్‌పూర్ ఆస్పత్రిలో చిన్నారుల మృతి ఘటనకు సంబంధించి బీఆర్డీ మెడికల్ కాలేజ్ వైద్యులు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాదారుపై యూపీ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ ప్రదానకార్యదర్శి రాజీవ్ కుమార్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వైద్య విద్య అడిషనల్ చీఫ్ సెక్రటరీ అనితా భట్నాగర్ జైన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్య డైరెక్టర్ జనరల్ కేకే గుప్తాపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు చిన్నారుల మృతిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదికలో యూపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అశుతోష్ టాండన్‌పై ఎలాంటి ప్రస్తావనా లేకపోవడం గమనార్హం. మరోవైపు సస్పెండ్ అయిన బీఆర్డీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, లక్నోకు చెందిన లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాదారుపైనా కేసులు నమోదు చేయవచ్చని భావిస్తున్నారు.