భార్య నుంచి భర్తకు భరణం
మాజీ క్రికెటర్ కేసులో గుజరాత్ కోర్టు అరుదైన తీర్పు
గాంధీనగర్: విడాకుల సందర్భంగా భార్యకు మనోవర్తి చెల్లించాలని భర్తను ఆదేశిస్తూ కోర్టులు తీర్పు చెప్పడం తెలిసిందే.. అయితే భార్యే.. భర్తకు భరణం చెల్లించాలని గుజరాత్ కోర్టు తీర్పు చెప్పిన అరుదైన కేసు ఇదీ. గుజరాత్‌కు చెందిన దల్బీర్‌సింగ్ అండర్ 17 లెవల్‌లో మాస్టర్ బ్లాస్టర సచిన్ టెండూల్కర్‌తో కలసి క్రికెట్ ఆడాడు. అయితే 2002లో రోడ్డు ప్రమాదం కారణంగా దల్బీర్ క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. 2010లో దల్బీర్ శస్త్రచికిత్సకు అయిన ఖర్చును సచినే చెల్లించాడు. కాగా, 2006లో దల్బీర్‌కు రాజ్వీందర్ కౌర్‌తో వివాహమైంది. అయితే తనను రాజ్వీందర్ శారీరకంగా..
మానసికంగా హింసిస్తోందని ఆరోపిస్తూ దల్బీర్ గాంధీనగర్ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఇంట్లో ఊతకర్ర సాయంతో నడవటానికి కూడా అనుమతిచ్చేది కాదని వాపోయాడు. ఈ కేసుకు సంబంధించి ఇరుగుపొరుగువారు, పోలీసుల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న గాంధీగనర్ కుటుంబ కోర్టు న్యాయమూర్తి డీటీ సోనీ.. దల్బీర్‌కు భరణం చెల్లించాలని రాజ్వీందర్‌ను ఆదేశిస్తూ శనివారం తీర్పు చెప్పారు.