అహ్మదాబాద్: నగరంలో విధించిన కర్ఫ్యూను శనివారం ఎత్తివేశారు. ఇతర వెనుకబడిన తరగతుల్లో (ఓబీసీ) తమను చేర్చాలన్న డిమాండ్‌తో పటేల్ సామాజిక వర్గీయులు చేపట్టిన ఆందోళనలను నియంత్రించేందుకు గత మంగళవారం(25న), ఆ ఉద్యమ నాయకుడు హార్దిక్‌పటేల్‌ను నిర్బంధించడంతో హింసాత్మక ఘటనలు తలెత్తాయి. వీటిని అణచి వేయడానికి పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగాయి. నగరంలో కర్ఫ్యూ విధించారు.గత రెండు రోజులుగా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొనడంతో కర్ఫ్యూను ఎత్తివేశారు.
'లాకప్‌డెత్' పోలీసులపై చర్యలు
పటేళ్ల ఆందోళనల సందర్భంగా అరెస్టైన శ్వేతంగ్ పటేల్ (32) అనే వ్యక్తి కస్టడీలో చనిపోయిన ఘటనపై ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా తొమ్మిది మంది పోలీసులను బాధ్యులుగా గుర్తించారు. గుజరాత్ హైకోర్టు ఆదేశాలతో సీఐడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. పటేళ్ల ఓబీసీ రిజర్వేషన్ల కోసం పోరాటానికి బాధ్యత వహిస్తున్న హార్దిక్ పటేల్ శనివారం మాట్లాడుతూ.. రేపు శ్వేతంగ్ అంత్యక్రియలకు తాను హాజరవుతున్న సందర్భంగా అక్కడ ఏదైనా జరిగే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
అహ్మదాబాద్‌లో కర్ఫ్యూ ఎత్తివేత
Published Sun, Aug 30 2015 2:19 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM
Advertisement
Advertisement