
సాక్షి, బెంగళూరు : బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. వడగండ్ల వానతో నగరం తడిసి ముద్దైంది. దీంతో ఎన్నికల ఏర్పాట్లకు అంతరాయం ఏర్పడింది. నిన్న, మొన్నటి వరకూ రాజకీయ ప్రచారాలో హీటెక్కిన ఉద్యాన నగరంపై బుధవారం వరుణుడు తన ప్రతాపం చూపించాడు. దీంతో లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
ఈ నెల 18న 14 నియోజకవర్గాల్లో పోలింగ్ కాగా, మంగళవారం సాయంత్రంతో బహిరంగ ప్రచారం ముగిసింది. తీవ్ర ఎండలను సైతం లెక్క చేయకుండా అన్ని పార్టీల నాయకులు ఓట్ల వేటలో నెలన్నర రోజులుగా చెమటలు కక్కారు. గత 45 రోజులుగా ఆయా పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు, స‍్వతంత్ర అభ్యర్థులు, వారి మద్దతుదారులు నిరంతరాయంగా ప్రచారంలో మునిగి తేలారు.
Comments
Please login to add a commentAdd a comment