‘నాక్కూడా మేక్‌ ఇన్‌ ఇండియా ఇష్టం’ | I like the 'Make in India : Rahul Gandhi | Sakshi
Sakshi News home page

‘నాక్కూడా మేక్‌ ఇన్‌ ఇండియా ఇష్టం’

Published Wed, Sep 20 2017 10:59 AM | Last Updated on Wed, Sep 20 2017 11:53 AM

‘నాక్కూడా మేక్‌ ఇన్‌ ఇండియా ఇష్టం’

‘నాక్కూడా మేక్‌ ఇన్‌ ఇండియా ఇష్టం’

న్యూయార్క్‌ : మేక్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌ తనకు కూడా ఇష్టమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అయితే, ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలో వారినే మరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మేక్ ఇన్‌ ఇండియా కార్యక్రమం కాంగ్రెస్‌ పార్టీనే ప్రవేశపెట్టాల్సి ఉండేదని, అంతకుముందే తమ పార్టీకి ఆ ఆలోచన ఉందని చెప్పారు.

’నాకు మేక్‌ ఇన్‌ ఇండియా కాన్సెప్ట్‌ అంటే చాలా ఇష్టం. కానీ, వారి దృష్టిని సారించాల్సిన వారిని పక్కన పెడుతున్నారు. నేనే ఆ పాలసీని అమలుచేస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ భావిస్తారు. మధ్యతరగతి, చిన్నతరహా కంపెనీలను లక్ష్యంగా పెట్టుకోవాలని నేను భావిస్తాను. ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి లభించేది ఈ రెండు రంగాల నుంచే’ అని రాహుల్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement