Princeton University
-
సంచలన ఆవిష్కరణ.. ఇక స్మార్ట్‌ఫోన్‌లో కెమెరా బంప్స్ కనపడవు!
ప్రస్తుత స్మార్ట్ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ ఇల్లు లేదు అని చెప్పుకోవడంలో పెద్ద అతిశయోక్తి లేదు. అంతలా విస్తరించింది, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచం. అయితే, ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్ కొనే ముందు తప్పక చూసే ఫీచర్స్‌లలో కెమెరా అనేది చాలా ముఖ్యమైనది. ఈ మధ్య కొన్ని కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం పెద్ద, పెద్ద కెమెరాల గల స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. ఇవీ, పనితీరు పరంగా చూస్తే బాగానే ఉన్న, చూడాటానికి అంత బాగుండటం లేదు. దీనికి, ముఖ్య కారణం మన స్మార్ట్‌ఫోన్ కెమెరాల వెనుక ఉండే పెద్ద, పెద్ద కెమెరా బంప్స్. ఇలా కెమెరా బంప్స్ పెద్దగా ఉండటం వల్ల కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ లుక్ కూడా దెబ్బతింటుంది. అయితే, ఈ సమస్యకు చెక్ పెడుతూ.. ప్రిన్స్టన్, వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు సరికొత్త ఆవిష్కరణతో ముందుకు వచ్చారు. మన స్మార్ట్ఫోన్లు నానో కెమెరాలతో త్వరలో రానున్నాయి. మీరు నానో కెమెరా సైజ్ గురుంచి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది చూడాటానికి చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రోబోటిక్స్ టెక్నాలజీ సహాయంతో నానో కెమెరాలను తయారు చేయవచ్చు అని పరిశోధకులు అన్నారు. ఈ అత్యంత చిన్న కెమెరాలో 1.6 మిలియన్ స్థూపాకార పోస్ట్‌లు ఉన్నాయి. ఇవి కాంతిని ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే?, ఈ నానో కెమెరా చిప్‌ను సంప్రదాయ కంప్యూటర్ చిప్స్ లాగా ఉత్పత్తి చేయవచ్చు. ఇవి అల్గోరిథంలపై ఆధారపడి పనిచేస్తాయి. నేచర్ కమ్యూనికేషన్స్‌లో వచ్చిన కథనం ప్రకారం.. నానో కెమెరాల కొత్త జెన్ ఔషధం, రోబోటిక్స్ లో ఉపయోగించే ప్రస్తుత నానో కెమెరా టెక్నాలజీతో సహాయంతో పనిచేస్తాయి. కొత్త నానో కెమెరాలతో చిత్రాలను సంప్రదాయ కెమెరాలతో సమానంగా పరిశోధకులు తీయగలిగారు. ఈ నానో కెమెరాలలో ఉపయోగించే కొత్త టెక్నాలజీని "మెటాసర్ఫేస్" అని పిలుస్తారు. దీనిలో సంప్రదాయ కెమెరా లోపల వక్రమైన కటకాలను నానో క్యామ్ ల ద్వారా ఉంచుతారు. ఇవీ, కేవలం అర మిల్లీమీటర్ వెడల్పుతో ఉంటాయి. పనితీరు పరంగా చూసిన ఇప్పుడు ఉన్న కెమెరాలతో సరిసమానంగా పనిచేస్తాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆండ్రాయిడ్ 13 ఫీచర్లు లీక్, వారెవ్వా.. అదరగొట్టేస్తున్నాయ్!) -
కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ
వాషింగ్టన్: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని .. వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!) అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తాము గర్తించినట్లు ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు. ఫ్లూ జాతికి చెందిన వైరస్ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’) బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్ తెలిపారు. వాతావరణం వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్ తెలిపారు. -
భారత ఉపఖండం వల్ల భూమిపై అనేక మార్పులు!
వాషింగ్టన్: భారత ఉపఖండం కారణంగా భూమిపై అనేక పెను మార్పులు చోటుచేసుకున్నాయన్న విషయం మీకు తెలుసా..? 5 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండం, భారత ఉపఖండం విడివిడిగా ఉండేవని మీరు ఎప్పుడైనా చదివారా..? అప్పట్లో ఆసియా ఖండం, భారత ఉపఖండం మధ్యలో ఉండే టెథీస్ అనే పురాతన సముద్రం గురించి మీరు విన్నారా..? అయితే మీరు 5 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జరిగిన మార్పులు తెలుసుకోవాల్సిందే. సరిగ్గా 5 కోట్ల ఏళ్ల కిందట భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి.. ప్రస్తుత ఆసియా ఖండంలా ఏర్పడింది. ఈ ఘటన ద్వారానే ఖండాల స్థితిగతులు, ప్రపంచ వాతావరణంతోపాటు ఇంకా మరెన్నో మార్పులు భూమిపై చోటుచేసుకున్న విషయాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. అయితే తాజాగా దీని కారణంగానే ప్రపంచ సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు పెరిగినట్లు కనుగొన్నారు. దీంతో భూమిపై జీవించడానికి అవసరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎమ్మా కాస్ట్ తెలిపారు. దీనికోసం 7 కోట్ల ఏళ్ల క్రితం నాటి అతిసూక్ష్మ సముద్రపు గవ్వలను ఉపయోగించి సముద్రాల్లోని నైట్రోజన్‌ను రికార్డు చేశారు. అప్పటి నైట్రోజన్ పరిస్థితులను పోల్చి చూశారు. అలాగే పురాతన సముద్రాల్లో ఉండే 15ఎన్ –14ఎన్ నైట్రోజన్ పరిస్థితులను పునర్ నిర్మించారు. అనంతరం అప్పటి ఆక్సిజన్ స్థాయిల్లో మార్పులను గమనించారు. దీన్ని బట్టి అప్పట్లో 15ఎన్–14ఎన్ నైట్రోజన్ స్థాయిలు అత్యధికంగా ఉండేవని, దీంతో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువగా ఉండేవని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను బట్టి భవిష్యత్తులో సముద్రాల్లో ఆక్సిజన్ స్థాయిలు భూమిపై ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో ఊహించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
వెంటాడే గూగుల్ నిఘా
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మీపై నిఘా పెడుతోందా? మీరు వద్దన్నా సరే మీ రాకపోకలు, మేసేజ్‌లు అన్నింటిని రికార్డు చేస్తోందా? అంటే నిపుణులు అవుననే జవాబిస్తున్నారు. తమ ప్రయాణ వివరాలు రికార్డు చేయవద్దని సెట్టింగ్స్ పెట్టినప్పటికీ గూగుల్ ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల సమాచార సేకరణను ఆపడంలేదు. అసోసియేటెడ్ ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ సంచలనాత్మక విషయం వెల్లడైంది. ఈ వివరాలను ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ పరిశోధకులకు పంపగా అనుమతి లేకుండా పౌరుల సమాచారాన్ని గూగుల్ సేకరిస్తోందని వారు ధ్రువీకరించారు. ‘గూగుల్ మ్యాప్స్’ వాడేటప్పుడు యూజర్ ఉన్న లొకేషన్ తెల్సుకునేందుకు అనుమతి ఇవ్వాలి. అలా చేస్తే ప్రజలు ఫోన్‌తో ఏ చోట్లకెళ్లారు? అక్కడ ఎంతసేపున్నారు? తదితర అంశాలను ఆటోమేటిక్‌గా రికార్డు చేస్తుంది. అయితే ఇది ఇష్టం లేని యూజర్ల కోసం ‘లొకేషన్ హిస్టరీ ఆప్షన్’ను ఆఫ్ చేసే సౌకర్యాన్ని గూగుల్ తెచ్చింది. దీన్నివాడితే యూజర్లు ఎక్కడున్నారో రికార్డు కాదని గూగుల్ చెప్పింది. తాజాగా పరిశోధకులు ఇది అబద్ధమని తేల్చారు. లొకేషన్ హిస్టరీ ఆప్షన్ ను నిలిపివేసినా కొన్ని గూగుల్యాప్స్ కస్టమర్లు ఎక్కడ, ఎంతసేపు ఉన్నారో రికార్డు చేస్తున్నాయని తేల్చారు. గూగుల్ మ్యాప్ యాప్‌ను ఒక క్షణం ఓపెన్ చేసినా స్క్రీన్ షాట్ ఆటోమేటిక్‌గా గూగుల్ తీసేసుకుంటోందని పరిశోధకులు తెలిపారు. ఆటోమేటిక్‌గా వాతావరణం గురించి చెప్పే యాప్స్ కూడా యూజర్లు ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని గూగుల్‌కు పంపిస్తూనే ఉంటాయి. లొకేషన్‌కు సంబంధం లేని మరికొన్ని యాప్స్ అయితే కేవలం 30 సెం.మీ కచ్చితత్వంతో ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమస్త సమాచారాన్ని గూగుల్‌కు అందజేస్తున్నాయి. 200 కోట్ల మందికి పైగా ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారుల సమాచారాన్ని గూగుల్ రికార్డు చేసిందన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా గూగుల్ వారి సమాచారాన్ని దొంగతనంగా సేకరించిందని ప్రిన్స్టన్ వర్సిటీకి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త జొనాథన్ మేయర్ తెలిపారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు వేర్వేరు మార్గాల్లో తాము యూజర్ల సమాచారాన్ని సేకరిస్తామని గూగుల్ ప్రతినిధి చెప్పారు. యూజర్లు myactivity.google.com ద్వారా తమ సెర్చింగ్లు, ఇతర వివరాలను చూసుకోవచ్చు. -
వేయని రోడ్లకూ సొమ్ము
వాషింగ్టన్: భారత్‌లో వేయని రోడ్లను నిర్మించినట్లు బిల్లులు చూపించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశారు. ఇందుకు స్థానిక రాజకీయ నేతలు, వారి బంధువులు, అవినీతి పరులు కుమ్మక్కై ప్రజాధనాన్ని దిగమింగేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై)లో లొసుగుల ఆసరాగా స్థానిక ప్రజాపతినిధులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి భారీ అవినీతికి పాల్పడ్డారు. విస్తుగొలిపే ఈ అంశాలన్నీ అమెరికాలోని ప్రిన్స్టన్ వర్సిటీ, ఫ్రాన్స్‌లోని పారిస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌కు చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. గ్రామీణ ప్రాంతాలను బాహ్య ప్రపంచానికి అనుసంధానిస్తూ చేపట్టే రహదారి నిర్మాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని అధ్యయనంలో తేలింది. రాజకీయనేతల కనుసన్నల్లోనే మారుమూల ప్రాంతాలను అనుసంధానిస్తూ గ్రామీణ రహదారులను నిర్మించినట్లు పీఎంజీఎస్‌వై సమాచార జాబితాలో పేర్కొన్నారు. వాటికి కేంద్రం నిధులు అందజేసినట్లు రాసేశారు. కానీ, అందులో పేర్కొన్న రోడ్లలో కనీసం ఒక్కరోడ్డు వేయలేదు. ఇలాంటివి 500 రోడ్లు ఉన్నట్లుగా పరిశోధక బృందం గుర్తించింది. కేంద్రం అందించిన నిధులు మాత్రం రహదారి నిర్మాణం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, పనులు కేటాయించిన స్థానిక రాజకీయనేతల ఖాతాల్లోకి వెళ్లిపోయాయని వెల్లడైంది. ఈ అవినీతి అంతటికీ స్థానిక ప్రజాప్రతినిధులే కారణమని పరిశోధకులు తేల్చారు. స్థానిక రాజకీయనేతలే ఈ అవినీతికి కారణమని నిర్ధారించేందుకు పరిశోధకుల బృందం శ్రమించాల్సి వచ్చింది. కాంట్రాక్టులను దక్కించుకున్న వారి ఇంటిపేర్లను స్థానిక ప్రజాప్రతినిధుల ఇంటిపేర్లతో సరిపోల్చాకే బృందం ఈ నిర్ణయానికొచ్చింది. రాజకీయనేతలు సిఫారసు చేసిన కాంట్రాక్టర్లకే రహదారి పనులు దక్కేలా చూసిన అధికారులు కూడా ఉద్యోగాలలో ప్రమోషన్లు పొందినట్లు పరిశోధకులు గుర్తించారు. -
‘నాక్కూడా మేక్ ఇన్ ఇండియా ఇష్టం’
న్యూయార్క్ : మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తనకు కూడా ఇష్టమని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అయితే, ఈ కార్యక్రమం ద్వారా ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలో వారినే మరుస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ప్రిన్స్టన్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీనే ప్రవేశపెట్టాల్సి ఉండేదని, అంతకుముందే తమ పార్టీకి ఆ ఆలోచన ఉందని చెప్పారు. ’నాకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అంటే చాలా ఇష్టం. కానీ, వారి దృష్టిని సారించాల్సిన వారిని పక్కన పెడుతున్నారు. నేనే ఆ పాలసీని అమలుచేస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుంది. పెద్ద వ్యాపారాలనే లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రధాని మోదీ భావిస్తారు. మధ్యతరగతి, చిన్నతరహా కంపెనీలను లక్ష్యంగా పెట్టుకోవాలని నేను భావిస్తాను. ఎక్కువ ఉద్యోగాలు, ఉపాధి లభించేది ఈ రెండు రంగాల నుంచే’ అని రాహుల్ చెప్పారు. -
అగణిత శాస్త్రశీలుడు...
మంజుల్ భార్గవ్... ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో గణిత విభాగం ప్రొఫెసర్... అత్యుత్తమ ‘ఫీల్డ్స్ మెడల్’ అందుకున్న మొట్టమొదటి భారతీయ గ ణిత శాస్త్రవేత్త. ‘నంబర్ థియరీ’ ఆవిష్కరణ వెనుక భారతీయ సంప్రదాయ గణితశాస్త్రవేత్తల శ్రమ ఉందనే సంప్రదాయవాది... గణిత శాస్త్రవేత్తలైన హేమచంద్రుడు, బ్రహ్మగుప్తులకు ఏకలవ్య శిష్యుడు... సంస్కృత పద్యకావ్యాలలో ఉండే లయ, గణిత శాస్త్ర సూత్రాల నుంచి లెక్కలను సులభంగా అర్థం చేసుకోవచ్చని చెప్పిన మంజుల్ భార్గవ్ గురించి... కెనడాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా ఉన్న మంజుల్ భార్గవ్ సంస్కృతభాషలో విరచితమైన గణిత శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. రెండు వందల ఏళ్లుగా ఎవరికీ అంతుచిక్కకుండా ఉన్న ఒక నంబర్ థియరీ పజిల్‌ను పరిష్కరించారు. ఏడో శతాబ్దపు గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు రాసిన సిద్ధాంతాలపై పట్టు సంపాదించారు మంజుల్. వాటిని సూత్రీకరిస్తూనే నంబర్ థియరీ పజిల్ పరిష్కరించారు. ఆయన కృషికి గుర్తింపుగా ఆయనను ఫీల్డ్స్మెడల్ అవార్డు వరించింది. గణితశాస్త్రంలో ఇచ్చే ఈ పురస్కారం, ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన నోబెల్‌తో సమానం. కెనడా దేశ పౌరసత్వం ఉన్నప్పటికీ, ఆయన భారతీయుడు. చిన్న నాటి నుంచి సంప్రదాయమంటే ఇష్టపడే మంజుల్ భార్గవ్ తల్లి గణితశాస్త్రవేత్త. ఆవిడకు సంగీతం, భాషా శాస్త్రాలలో ప్రవేశం ఉంది. అందువల్ల భార్గవ్‌కు సాహిత్యం, ముఖ్యంగా సంస్కృత కావ్యాలు చదివే అవకాశం వచ్చిందనీ, సంగీతం మీద అభిరుచి పెరిగిందనీ అంటారు. ‘‘నాకు తబలా అంటే చాలా చాలా ఇష్టం. హిందుస్థానీ, కర్ణాటక సంగీతాలలో ఉండే లయను ఇష్టపడతాను. నా మొదటి సంగీత గురువు మా అమ్మ. ఆవిడ సంగీతం పాడతారు, తబలా వాయిస్తారు’’ అని చెప్పే భార్గవ్‌కు మూడు సంవత్సరాల వయసప్పుడు తల్లి, తబలాలోని బేసిక్ సౌండ్ ఎలా వాయించాలో నేర్పారు. ఎంత ప్రయత్నించినా భార్గవ్ నోటి నుంచి చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు. భార్గవ్‌తో పాటు అతనిలో తబలా నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరగడంతో... జైపూర్‌లోని పండిట్ ప్రేమ్ ప్రకాశ్ దగ్గర తబలా విద్య కొంత నేర్చుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ దగ్గర మెలకువలు నేర్చుకున్నారు. మంజుల్ భార్గవ్ తాతగారు పరోక్షంగా భార్గవ్‌కు గురువు. ఆయన సంస్కృత పండితుడు, చరిత్ర కారుడు. ఆయన బాల్యం నుంచే భార్గవ్‌కు ప్రాచీనన గణితశాస్త్రం నేర్పారు. నాటి గణితకారులంతా వారిని వారు కవులుగా చెప్పుకున్నారే కాని, గణిత శాస్త్రవేత్తలుగా చెప్పుకోలేదనీ, భాషావేత్తలయిన పాణిని, పింగళ, హేమచంద్ర, నారాయణ... వీరు కవిత్వం చదివి, అద్భుతమైన గణిత సూత్రాలను ఆవిష్కరించిన విషయాన్ని తాతగారు తనకు చెప్పేవారని భార్గవ్ అంటారు. ఆయన చెప్పిన ఎన్నో కథలు భార్గవ్‌లో కొత్త ఆలోచనలకు పునాదులు వేసింది. గణితం లయాత్మకమని భార్గవ్ చెబుతారు. సంస్కృత భాషలో లయను గురులఘువులు సూచిస్తాయి. గురువును రెండు మాత్రల కాలంలో, లఘువును ఒక మాత్ర కాలంలో పలుకుతాం. ఎన్ని గురు లఘువులు కలిస్తే ఎనిమిది లయలు ఏర్పడతాయని ఎవరినైనా అడిగితే, కొందరు నాలుగు గురువులు కలిస్తే అనవచ్చు. మరికొందరు మూడు లఘువులు, రెండు గురువులు, ఒక లఘువు కలిస్తే వస్తుందనవచ్చు. క్రీ.పూ. 500 - 200 కాలంలో పింగళుడు తన చండశాస్త్రంలో దీనిని ఎంతో చక్కగా వివరించారని భార్గవ్ అంటారు. ‘డైజీ’ పూలను తన గురువుగా భావిస్తారు. ఈ పువ్వుకి 34 రెక్కలు ఉంటాయి. అంటే ఎనిమిది లయలన్నమాట. ఇటువంటి ఎన్నో అంశాలను భార్గవ్ సంస్కృత సాహిత్యం చదువుతూ తెలుసుకోవడం ప్రారంభంచారు. అలా సంస్కృత గణిత సాహిత్యాన్ని భార్గవ్ తన వశం చేసుకోగలిగారు. ఇంతటి అత్యున్నత పురస్కారాన్ని చేజిక్కించుకోగలిగారు. - డా. వైజయంతి నోబెల్ బహుమతి గణితశాస్త్ర విభాగానికి ఇవ్వరు. అందువల్ల గణితంలో అత్యున్నత గౌరవంగా ‘ఫీల్డ్స్ మెడల్’ ను బహూకరిస్తారు. సాధారణంగా ఈ బహుమతిని అమెరికా, రష్యా, ఫ్రెంచి, ఇంగ్లండ్ దేశస్థులు గెలుచుకుంటారు. ఇంతవరకు ఈ నాలుగు దేశాలకు 38 మెడల్స్ వచ్చాయి. ఈ బహుమతిగా 15 వేల డాలర్లు ఇస్తారు. ఈ మొత్తం నోబెల్లో సరిగ్గా పదో వంతు. శ్రీనివాస రామానుజన్ అధ్యయనం చేసిన అంశంలో మంజుల్ ప్రతిభ చూపడం విశేషం. మంజుల్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ‘గాస్’ శాస్త్రవేత్త చూపిన పరిష్కారాన్ని మరింత సరళం చేశారు. నాలుగేళ్లకోసారి భారతదేశానికి వచ్చినప్పుడు తాతయ్య, అమ్మమ్మలతో ఆరునెలలు గడిపేవారు. ఆ సమయంలో సంస్కృతం, తబలా నేర్చుకునేవారు. తబలా వాదనలోనూ, సంస్కృత శ్లోక పఠనంలోనూ ఉండే లయ పూర్తిగా గణితాత్మకమే అంటారు మంజుల్. అమెరికాలో పెరిగినా, ఇంట్లో మాత్రం భారతీయ వాతా వరణం, భారతీయ భోజనం. నా చిన్నతనంలో మార్టిన్ గార్డెనర్ రాసిన ‘మేథమేటిక్స్ మ్యాజిక్ అండ్ మిస్టరీ’ పుస్తకం చదివి ఆ ఫన్ను ఎంజాయ్ చేశాను. గురువులకు, లెక్కలంటే భయపడే విద్యార్థులకు లెక్కలలో ఆసక్తి కలగడానికి వీలుగా మూడు సూచనలిచ్చాను... లె క్కలను శాస్త్రీయ పద్ధతిలో కాకుండా రకరకాల కళల ద్వారా తెలియచెప్పాలి. అంటే పజిల్, బొమ్మలు, మ్యాజిక్, కవిత్వం, సంగీతం... వీటన్నిటినీ లెక్కల తరగతి గదిలోకి తీసుకురావాలి. విద్యార్థులకు లెక్కలు నేర్పే విధానం యాంత్రికంగా ఉండకూడదు. వాళ్లకి వాళ్లుగా ఆలోచించేలా ఉండాలి. లెక్కలంటేనే ఉత్సాహంగా సృజనాత్మకంగా పరిష్కరించాలి. అందుకోసం విద్యార్థులంతా కలిసి కొత్త కొత్త వాటిని కనుక్కోవాలి, కలిసి పని చేయాలి. ఈ మూడు సూత్రాలను అనుసరించి గురువులు లెక్కలు నేర్పితే, గురువులకే కాదు విద్యార్థులకు కూడా లెక్కలంటే భయం పోతుంది. చదువును ఆడుతూపాడుతూ నేర్చుకుంటే, కొత్తకొత్త ఆవిష్కరణలకు నాంది ఏర్పడుతుంది. అంతేకాని చదువును చూడకూడదు. - మంజుల్ భార్గవ్ -
అమెరికాలో టాప్-20 కాలేజీలివే
-
ప్రిన్స్టన్ డీన్‌గా భారతీయుడు
వాషింగ్టన్: అమెరికాలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక పదవి లభించింది. ప్రొఫెసర్ సంజీవ్ కులకర్ణిని ప్రతిష్టాత్మక ప్రిన్స్టన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు డీన్‌గా నియమించారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో ప్రొఫెసర్, కెల్లర్ సెంటర్ డెరైక్టర్‌గా ఉన్న కులకర్ణి మార్చి 31న కొత్త బాధ్యతలు చేపడతారని బుధవారం యూనివర్సిటీ ప్రకటించింది. న్యూజెర్సీ కేంద్రంగా ఉన్న ఈ వర్సిటీకి 2002 నుంచి విలియం రస్సెల్ డీన్‌గా ఉంటున్నారు. ‘సంజీవ్ కులకర్ణి ప్రిన్స్టన్ గ్రాడ్యుయేట్ స్కూల్‌కు అద్భుతమైన డీన్‌గా వ్యవహరిస్తారు’ అని ప్రిన్స్టన్ ప్రెసిడెంట్ క్రిస్టఫర్ ఐస్బ్రూగెర్ కొనియాడారు. ప్రిన్స్టన్లో 1991లో ఫ్యాకల్టీగా చేరిన కులకర్ణి మాట్లాడుతూ, తనను డీన్‌గా నియమించినందుకు సంతోషం వ్యక్తంచేశారు. యూనివర్సిటీతో 20 ఏళ్లకుపైగా అనుబంధముందని, ప్రిన్స్టన్కు మరిన్ని సేవలు చేసేందుకు మంచి అవకాశం లభించిందని చెప్పారు.