
'అవును ఆరెస్సెస్ వల్లే రాజకీయాల్లోకి..'
న్యూఢిల్లీ: తమపై ఆరెస్సెస్ ప్రభావం ఉందని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపట్ల కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సానుకూలంగా స్పందించారు. తమపై ఆరెస్సెస్ ప్రభావం ఉన్నందుకు గర్వంగా భావిస్తున్నామని, అందుకే తాము రాజకీయాల్లోకి వచ్చామని సమర్థించుకున్నారు. ఈ విషయం చెప్పడాన్ని తాను గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం లోక్ సభలో ప్రతిపక్షాలు ఆరెస్సెస్ చేసిన దాడిని ఆయన ఈ విధంగా తిప్పికొట్టారు. ఎప్పుడు ఆరెస్సెస్తో లింక్ పెట్టి ప్రతిపక్షాలు విమర్శలు చేసిన వాటిపై బీజేపీ నేతలు పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ఆయన నేరుగా ప్రతిపక్షాల విసుర్లకు సమాధానం చెప్పి ఆశ్చర్యంలో ముంచెత్తారు.