
'నా సోదరిని కలిసేందుకు అనుమతించలేదు'
ఇంఫాల్: తన సోదరిని కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని మణిపాల్ ఉక్కుమహిళ ఇరోమ్ చాను షర్మిల సోదరుడు సింగ్జిత్ ఇరోమ్ తెలిపారు. దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత తన సోదరిని కలిసేందుకు ప్రయత్నించానని ఆయన వెల్లడించారు. తమ భవిష్యత్ కార్యాచరణ కోసం ఆమెను కలవాలనుకున్నట్టు చెప్పారు.
ఇరోమ్ షర్మిల డిమాండ్ నేరవేరే వరకు ఆమెను కలవకూడదని తన తల్లి నిర్ణయించుకుందని, దానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మణిపూర్ లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దు కోసం 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల మంగళవారం విరమించనున్నారు.