కరోనా కట్టడి : పోర్టబుల్‌ వెంటిలేటర్లు సిద్ధం | IIT Kanpur To Develop Low Cost Portable Ventilators | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడి : పోర్టబుల్‌ వెంటిలేటర్లు సిద్ధం

Published Thu, Mar 26 2020 6:51 PM | Last Updated on Thu, Mar 26 2020 6:51 PM

IIT Kanpur To Develop Low Cost Portable Ventilators - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసులు వ్యాప్తి చెందుతుండటంతో ప్రతిష్టాత్మక సంస్థ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఐఐటీ కాన్పూర్‌ అతితక్కువ ధరకే లభ్యమయ్యే పోర్టబుల్‌ వెంటిలేటర్లను అభివృద్ధి చేస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం లభ్యమయ్యే ఇన్వేజివ్‌ వెంటిలేటర్ల ధర ఒక్కోటి రూ 4 లక్షలు కాగా, తాము అభివృద్ధి చేసే వెంటిలేటర్‌ రూ 70,000కే అందుబాటులో ఉంటుందని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్లు వెల్లడించారు. తాము తయారుచేసే వెంటిలేటర్లలో విడిభాగాలన్నీ భారత్‌ నుంచే లభ్యమవుతాయని వారు చెప్పారు. ఈ పోర్టబుల్‌ వెంటిలేటర్‌ ప్రోటోటైప్‌ను ఐఐటీ కాన్పూర్‌ ఇంక్యుబేటర్‌లో  నిఖిల్‌ కురూలే, హర్షిత్‌ రాధోర్‌లకు చెందిన స్టార్టప్‌ నొక్కా రోబోటిక్స్‌ అభివృద్ధి చేస్తోంది.


ఈ ప్రొటోటైప్‌ను అత్యున్నత వైద్య నిపుణులతో కూడిన కమిటీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన వెంటనే నెలలో దాదాపు 1000 పోర్టబుల్‌ వెంటిలేటర్లను ఈ స్టార్టప్‌ సిద్ధం చేయనుంది. మొబైల్‌ ఫోన్‌కు శాశ్వతంగా కనెక్ట్‌ చేయబడి ఉండే ఈ వెంటిలేటర్‌ను ఫోన్‌ ద్వారానే నియంత్రిస్తూ కీలక సమాచారాన్ని యాక్సెస్‌ చేయవచ్చని కాన్పూర్‌ ఐఐటీ బృందం వెల్లడించింది. అవసరమైతే ఆక్సిజన్‌ సిలిండర్‌ను దీనికి అటాచ్‌ చేసే వెసులుబాటు ఉందని తెలిపింది.

చదవండి : కరోనా: వర్క్‌ ఫ్రం హోం వాళ్లు ఇలా చేయండి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement