న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీత విషషంలో బీజేపీ ప్రభుత్వం ముందుగా కాంగ్రెస్ నేతలనే టార్గెటె చేసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్, ఆమె కుమారుడు రాణీందర్ సింగ్ ల స్విస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరింది. విదేశాల్లో నల్లధనం దాచారనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు స్విట్జర్లాండ్ పన్నులశాఖ కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై స్పందించింది. ప్రణీత్ కూర్, ఆమె కుమారుడు తమ దగ్గర పదిరోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చని స్విస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది.
అయితే తమకు విదేశాల్లో ఖాతాలున్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ గతంలోనే ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ భార్య అయిన ప్రణీత్ కౌర్- మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బడా నాయకులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ఎన్డీయే ప్రభుత్వం ఆరోపిస్తోంది. బ్లాక్మనీ లిస్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేయనున్నామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
వారి స్విస్ ఖాతాల వివరాలు కావాలి
Published Tue, Nov 24 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM
Advertisement