Raninder Singh
-
షూటింగ్ సెలక్షన్స్‌పై హీనా ఫిర్యాదు
న్యూఢిల్లీ: భారత మేటి షూటర్ హీనా సిద్ధూ తనకు సెలక్షన్స్‌లో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు శనివారం జాతీయ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) తలుపు తట్టింది. అయితే రోజంతా నిరీక్షించిన ఆమెకు ఎన్ఆర్ఏఐ చీఫ్ రణీందర్ సింగ్ ఆదివారం చర్చిద్దామని హామీ ఇచ్చారు. ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన భారత షూటింగ్ జట్టులో తనను మిక్స్డ్ పెయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని 28 ఏళ్ల హీనా వాపోయింది. కేవలం వ్యక్తిగత ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనే ఎంపిక చేయడం అసంతృప్తికి గురిచేస్తోందని చెప్పింది. 25 మీ. పిస్టల్ ఈవెంట్లో ఆమె కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్. 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్లోనూ హీనా రజతం నెగ్గింది. ‘ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రణీందర్ సింగ్‌ను కలిసేందుకు రోజంతా నిరీక్షించాను. ఎట్టకేలకు ఆయన స్పందించి ఆదివారం మాట్లాడదామని చెప్పారు. ఆయన మంచి వ్యక్తి అని తెలిసే ఇక్కడికి వచ్చాను. మెరిట్‌కు విలువిస్తారని, పారదర్శకత పాటిస్తారనే నమ్మకముంది. కొందరికి ప్రయోజనం చేకూర్చేందుకు సెలక్షన్ కమిటీలో సాంకేతిక అవకతవకలకు పాల్పడ్డారు’ అని హీనా విమర్శించారు. మను బాకర్‌కు మేలు చేకూర్చేందుకే తనను టీమ్ ఈవెంట్ నుంచి తప్పించారని ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు తెస్తున్న తనలాంటి షూటర్లకే ఇలాంటి పరిస్థితి రావడం ఘోరమని ఆమె వాపోయింది. -
వ్యక్తిగత కోచ్‌లను అనుమతించడం వల్లే..
రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న షూటర్ల పేలవ ప్రదర్శనపై భారత రైఫిల్ అసోసియేషన్ అధ్యక్షుడు రణీందర్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను నిందించుకోవడం తప్ప చేసేదేమీ లేదంటూ ఆవేదన చెందారు. కొంతమంది షూటర్లకు వ్యక్తిగత కోచ్‌లను అనుమతించమే తాము చేసిన అతి పెద్ద తప్పిదమని రణీందర్ పేర్కొన్నారు.ఈ విషయంపై భవిష్యత్తులో తాము ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 'పలువురు వ్యక్తిగత కోచ్‌లను నియమించుకోవడానికి గతంలో అనుమతినిచ్చాం. అదే మేము గుడ్డిగా చేసిన తప్పిదం. ఈ కారణం చేత తుది ఫలితం రాబట్టడంలో విఫలమయ్యాం. ముఖ్యంగా ముగ్గురు అథ్లెట్ల ప్రదర్శన చాలా పేలవంగా ఉండగా, మిగతా వారు బాగానే ఆకట్టుకున్నారు'అని ఆయా షూటర్ల పేర్లను ప్రస్తావించని రణీందర్ విమర్శలు గుప్పించారు. రియో ఒలింపిక్స్‌కు 12 మంది షూటర్ల బృందం వెళితే ప్రదర్శన ఎంతమాత్రం ఆశాజనకంగా లేదన్నారు. దీనిపై తనను విమర్శించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నాడు. ఇప్పటికే పలు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఒక భారత షూటర్ ఏ ఒక్క దాంట్లోనూ కనీసం ప్రదర్శన చేయలేదని గగన్ నారంగ్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. దీనిపై తమ ఫెడరేషన్ సీరియస్ దృష్టి సారించిందని రణీందర్ పేర్కొన్నాడు. -
వారి స్విస్ ఖాతాల వివరాలు కావాలి
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెలికితీత విషషంలో బీజేపీ ప్రభుత్వం ముందుగా కాంగ్రెస్ నేతలనే టార్గెటె చేసినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్, ఆమె కుమారుడు రాణీందర్ సింగ్ ల స్విస్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి వివరాలు కావాలని భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్ ను కోరింది. విదేశాల్లో నల్లధనం దాచారనే ఆరోపణలతో కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అటు స్విట్జర్లాండ్ పన్నులశాఖ కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనపై స్పందించింది. ప్రణీత్ కూర్, ఆమె కుమారుడు తమ దగ్గర పదిరోజుల్లోగా అప్పీల్ చేసుకోవచ్చని స్విస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అయితే తమకు విదేశాల్లో ఖాతాలున్నాయన్న ఆరోపణలను కాంగ్రెస్ మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ గతంలోనే ఖండించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అమరీందర్ సింగ్ భార్య అయిన ప్రణీత్ కౌర్- మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ సహాయ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి నలుగురు బడా నాయకులకు స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్నట్టు ఎన్డీయే ప్రభుత్వం ఆరోపిస్తోంది. బ్లాక్‌మనీ లిస్టులో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేయనున్నామని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే.