ఇండియన్‌ విమానాశ్రయాల్లో కొత్త మార్పు | Indian Airports To Transition From Pat-Downs To Full Body Scanners | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ విమానాశ్రయాల్లో కొత్త మార్పు

Published Mon, Apr 3 2017 8:42 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

ఇండియన్‌ విమానాశ్రయాల్లో కొత్త మార్పు

ఇండియన్‌ విమానాశ్రయాల్లో కొత్త మార్పు

కోల్‌కతా: త్వరలో భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లోకి ఫుల్‌ బాడీ స్కానర్స్‌ రాబోతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న తడిమి తనిఖీ చేసే పద్ధతి స్థానంలోకి ఈ కొత్త స్కానర్లతో తనిఖీలు రానున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా గతంలోనే ఢిల్లీలో ఎయిర్‌పోర్ట్‌లో ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ వీటిని పరీక్షించి చూశారు. దేశంలోని పలు వాణిజ్య పరమైన విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ మాత్రమే సెక్యూరిటీ చూస్తుంటుంది. అయితే, అప్పట్లో ఈ స్కానర్లు బాగానే పనిచేసినప్పటికీ పలువురు ప్రయాణీకులు మాత్రం తీవ్ర అభ్యంతరం చెప్పారు.

ముఖ్యంగా భారతీయ మహిళలు ధరించే తాళి, ఎక్కువ మడతలు ఉండే చీరలాంటివాటిని స్కానింగ్‌ చేసే సమయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ నేపథ్యంలో ఈ ఐడియాకు ఎక్కువమంది అనుకూలంగా లేరని అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే, ప్రస్తుతం ఎదుర్కొంటున్న భద్రతాపరమైన సమస్యల నేపథ్యంలో ఫుల్‌ బాడీ స్కానర్లు తప్పక అన్ని విమానాశ్రయాల్లో అవసరమేనని భావిస్తున్నామని వాటిని త్వరలోనే ప్రవేశపెడతామని సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఓపీ సింగ్‌ తెలిపారు. విమానాల్లోని ప్రయాణికుల క్యాబిన్‌లోకి ల్యాప్‌టాప్‌ను నిషేధించే అంశాన్ని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. గత నెలలో అమెరికా, బ్రిటన్‌ విమానాల్లోకి ల్యాప్‌ టాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. 

సంబంధిత మరిన్ని కథనాలకై చదవండి 

చీర, మంగళసూత్రం ఉంటే ఎయిర్‌పోర్టులో కష్టమే

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement