విమానాశ్రయాల్లో హై అలర్ట్ | high alert in indian airports | Sakshi
Sakshi News home page

విమానాశ్రయాల్లో హై అలర్ట్

Published Thu, Mar 24 2016 8:45 AM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM

విమానాశ్రయాల్లో హై అలర్ట్

విమానాశ్రయాల్లో హై అలర్ట్

న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇండిగో ఎయిర్‌క్రాఫ్ట్‌కు బెదిరింపు కాల్ రావటంతో దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. 11 ఇండిగోవిమానాలను పేల్చేస్తామని చెన్నైలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ కాల్ సెంటర్‌కు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తన పేరు స్మిత్ అని, అమెరికా నుంచి కాల్ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.

దీంతో ఇండిగో విమానాలు ఆపరేట్ అవుతున్న పది విమానాశ్రయాల్లో అప్రమత్తత ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్, వడోదర, గువాహటి, గోవా, కొచ్చి విమానాశ్రయాల్లో ఇండిగో విమానాలను అత్యవసరంగా ఆపేశారు. విమానాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement