భారత నావికాదళంలోకి 'వరుణాస్త్ర'
న్యూ ఢిల్లీ: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడిన నౌకావిధ్వంసక ఆయుధం(టార్పెడో) 'వరుణాస్త్ర'ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ బుధవారం భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టారు. 1.25 టన్నుల బరువుతో హెవీ వెయిట్ విభాగానికి చెందిన ఈ నౌకా విధ్వంసక ఆయుధాన్ని డీఆర్డీవో నావల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ లేబోరేటరీ రూపొందించింది. ఈ ఏడాది రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మొదటిసారి దీనిని ప్రదర్శించిన విషయం తెలిసిందే.
250 కిలోల పేలుడు పదార్థాలను గంటకు 40 నాటికల్ మైళ్ల వేగంతో తీసుకెళ్లగల సామర్ధ్యం వరుణాస్త్రకు ఉంది. భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) వీటిని తయారు చేయనుంది. ప్రభుత్వం ఈ టార్పెడోలను ఎగుమతి చేసే విషయం గురించి ఆలోచిస్తున్నట్లు పారికర్ వెల్లడించారు. ఈ విషయం గురించి ఇప్పటికే నావికాదళ చీఫ్తో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వరుణాస్త్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ త్రిమూర్తులు మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా తమ బృందం చేసిన కృషి ఫలించిందన్నారు.