న్యూఢిల్లీ : భారతీయ రైల్వే చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఓ వినూత్న పథకానికి తెరలేపింది. ఇక నుంచి రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత ఈ సేవలు ఇండోర్ నుంచి వెళ్లే 39 ప్యాసింజర్ రైళ్లలో అందుబాటులోకి రానున్నాయి. వీటిలో డెహ్రాడూన్-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ (14317), న్యూఢిల్లీ-ఇండోర్ ఇంటర్‌సిటీఎక్స్‌ప్రెస్ (12416), ఇండోర్-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్ (19325) రైళ్లున్నట్లు ఓ రైల్వే అధికారి తెలిపారు. ఈ సేవలు 20 రోజుల్లో ప్రారంభమవుతాయని, ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు వీటిని పొందవచ్చని తెలిపారు. ప్రయాణికులు రూ.100 చెల్లించి తల, పాదాల మసాజ్ చేయించుకోవ చ్చని చెప్పారు. ప్రతి రైలులో ముగ్గురి నుంచి ఐదుగురి వరకు మసాజ్ చేవారుంటారు. రైల్వే శాఖ వారికి గుర్తింపు కార్డులు జారీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment