దొంగ యుద్ధానికి దిగుతున్నారు | It Is Proxy War: Jammu And Kashmir Government On Recent Terror Attacks | Sakshi
Sakshi News home page

దొంగ యుద్ధానికి దిగుతున్నారు

Published Wed, Jun 29 2016 5:07 PM | Last Updated on Mon, Sep 4 2017 3:43 AM

It Is Proxy War: Jammu And Kashmir Government On Recent Terror Attacks

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ లో సైనికులపై జరుగుతున్న వరుసదాడుల వెనకాల కుట్ర ఉందని, పొరుగు దేశం(పాకిస్థాన్) దొంగ దెబ్బతీస్తూ పరోక్ష యుద్ధానికి దిగుతోందని ఆరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అసెంబ్లీలో తెలిపారు. ఈ విషయంపై తాము కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలతో కూడిన అమర్ నాథ్ యాత్రకు ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారు.

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో తృప్తి చెందని ప్రతిపక్ష నాయకుడు ఒమర్ అబ్దుల్లా శాంతి భధ్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి వివరణ ఇవ్వాలని  డిమాండ్ చేశారు. అమర్ నాథ్ యాత్ర రెండు నెలల్లోముగుస్తుందని కానీ రాష్ట్రంలో ముఖ్యంగా బార్డర్లో నివసిస్తున్నప్రజల  పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితిపై మౌనంగా ఉండటం సరికాదన్నారు. చొరబాటుదారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది పనితీరుపై పత్రికల్లో వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement