అది అత్యంత కఠిన సమయం! | Jaya hospitalisation most critical period in TN political history | Sakshi
Sakshi News home page

అది అత్యంత కఠిన సమయం!

Published Tue, Oct 17 2017 3:07 AM | Last Updated on Tue, Oct 17 2017 3:07 AM

Jaya hospitalisation most critical period in TN political history

చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా తాను అదనపు బాధ్యతలు నిర్వర్తించిన 13 నెలల కాలం ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలో అత్యంత క్లిష్టమైన దశ అని మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. అధినేత్రి జయలలిత మరణం అనంతరం అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం.. తదనంతర పరిణామాలు అత్యంత సున్నితమైనవన్నారు. ‘దోజ్‌ ఈవెంట్‌ఫుల్‌ డేస్‌’ పేరుతో నాటి పరిణామాల్ని అక్షరబద్ధం చేసిన పుస్తకాన్ని సోమవారం రాజ్‌భవన్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

విద్యాసాగర్‌ రావు గవర్నర్‌గా ఉన్న సమయంలోనే జయ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం, ఆ తరువాత మరణించడం, వార్దా తుపాను, జల్లికట్టు నిరసనలు.. మొదలైన అత్యంత సున్నిత ఘటనలు చోటు చేసుకున్నాయి. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన తనను నాటి సీఎం జయలలిత విమానాశ్రయానికి వచ్చి ఆహ్వానించడాన్ని విద్యాసాగర్‌ రావు గుర్తు చేసుకుంటూ.. ఆమె అంటే తనకెంతో గౌరవమన్నారు. పళనిస్వామి ప్రభుత్వంపై 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పుడు బలపరీక్ష నిర్వహించకపోవడంపై విద్యాసాగర్‌ రావుపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement