మార్కండేయ ఖట్జూపై ఎఫ్ఐఆర్
పాట్నా: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూపై బిహార్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఖర్జూపై ఫిర్యాదు చేశారు. బిహార్ను పాకిస్థాన్లో కలపాలంటూ ఖర్జూ చేసిన వ్యాఖ్యలు 10 కోట్ల మంది బిహార్ ప్రజలతోపాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులందరినీ తీవ్రంగా బాధించాయని నీరజ్ పేర్కొన్నారు.
కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాకిస్థాన్‌కు ఇచ్చేస్తామంటూ..కశ్మీర్ కావాలంటే బిహార్‌తో కలిపి ఒక ప్యాకేజీలాగా ఇస్తామని.. బిహార్ వద్దనుకుంటే రెండింటినీ ఇవ్వబోమని ఆయన ఫేస్‌బుక్‌లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో ఖర్జూపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.