Markandeya Katju
-
చెర మార్చేనా?
► కసరత్తుల్లో చిన్నమ్మ న్యాయవాదులు ► ఆ కేసు ఖర్చు రూ.12 కోట్లు ► టీఎన్ కు త్వరలో కర్ణాటక లేఖ ► మనో వేదన, అనారోగ్య సమస్య ► శిక్ష అనుభవించాల్సిందే :మార్కండేయ కట్జు సాక్షి, చెన్నై: పరప్పన అగ్రహార చెర నుంచి తమిళనాడులోని ఏదో ఒక జైలుకు చిన్నమ్మ శశికళను మార్చేనా? అన్న చర్చ బయలు దేరింది. ఇందుకు తగ్గ కసరత్తుల్లో న్యాయవాదులు సెంథిల్, అశోకన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, అక్రమాస్తుల కేసు ఖర్చు రూ. 12 కోట్లుగా కర్ణాటక సర్కారు తేల్చింది. ఈమొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో అక్కడి అధికారులు ఉన్నట్టు సమాచారం. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి చిన్నమ్మ శశికళ, బంధువులు ఇలవరసి,సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ, ఇలవరసి ఒకే గదిలో ఉన్నారు. శుక్రవారం వేకువజామున శశికళ ధ్యానం చేసినట్టు, అల్పాహారంగా పులిహోర, మధ్యాహ్నం రాగి సంగటి స్వీకరించినట్టు జైలు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, రాత్రికి చపాతీతో పాటు పండ్లు సిద్ధం చేశారు. చిన్నమ్మకు మధుమేహం ఉండడంతో అందుకు తగ్గ మాత్రలు తీసుకున్నట్టు, మోకాలి నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉండడంతో ఆయుర్వేద మందుల్ని తీసుకున్నట్టు సమాచారం. ఆమెకు ఎలాంటి వసతులు లేని దృష్ట్యా, నేల మీద నిద్రకు ఉపక్రమించక తప్పడం లేదని తెలుస్తోంది. బెంగళూరు చెరలో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుండడంతో, శిక్షను తమిళనాడులోని ఏదేని ఒక జైల్లో అనుభవించే విధంగా ప్రత్యేక వ్యూహాన్ని రచించే పనిలో ఆమె తరఫు న్యాయవాదులు నిమగ్నమైనట్టు మద్దతుదారులు పేర్కొంటున్నారు. చెన్నై లేదా వేలూరు, లేదా కోయంబత్తూరు కేంద్ర కారాగారాల్లో ఒక దానిని ఎంపిక చేసి, ఆమెను జైలు మార్చేందుకు తగ్గ ప్రయత్నాల్ని న్యాయవాదులు సెంథిల్, అశోకన్ వేగవంతం చేసినట్టు సమాచారం. ఈ ఇద్దరు చిన్నమ్మ శశికళతో సంప్రదింపులు జరిపినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బల పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గిన క్షణాల్లో ఇందుకు తగ్గ ప్రయత్నాల్ని వేగవంతం చేస్తూ కోర్టును ఆశ్రయించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి ఉన్నట్టు తెలిసింది. దీంతో చిన్నమ్మను తమిళనాడులోని జైలుకు మార్చేనా అన్న చర్చ ఊపందుకుంది. పళనిస్వామి నేతృత్వంలో ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన పక్షంలో, ఇక అన్నాడీఎంకే వర్గాలతో పరప్పన అగ్రహార చెర పరిసరాలు కిక్కిరిసే అవకాశాలు ఎక్కువే. ఇది కాస్త అక్కడి అధికార యంత్రాంగానికి ఇబ్బంది కరమే. రూ.12 కోట్లు : అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక ప్రభుత్వం రూ.12 కోట్లు ఖర్చు పెట్టింది. 2004 నుంచి 2016 వరకు ఈ కేసు విచారణ బెంగళూరు కోర్టులో సాగిన విషయం తెలిసిందే. తొలుత సిటీ సివిల్ కోర్టులో, తదుపరి అక్కడి హైకోర్టులో, చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. 2004 నుంచి సిటీ సివిల్ కోర్టులో జరిగిన విచారణకు రూ. 2.86 కోట్లు, హైకోర్టులో జరిగిన విచారణకు రూ. 6.68 కోట్లు, పలు శాఖలకు మరో రూ. 3.78 కోట్లు ఖర్చును కర్ణాటక ప్రభుత్వం వెచ్చించింది. ఇక, భద్రతా ఏర్పాట్ల కోసం రూ.70 లక్షలకు పైగా మొత్తం 12 లక్షలు ఖర్చు జరిగినట్టు అక్కడి గణాంకాల విభాగం తేల్చింది. ఈ మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు తగ్గ చర్యల్లో ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో తమిళనాడు ప్రభుత్వానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. కేసుల విచారణకే లెక్కల్ని ప్రకటించిన కర్ణాటక సర్కారు, ఇక రాష్ట్రంలో చిన్నమ్మ రిమోట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరెంత ఖర్చు పెట్టాల్సి ఉంటుందేమో వేచి చూడాల్సిందే. ఈ పరిణామాలను పరిగణించి బల పరీక్షలో పళనిస్వామి నెగ్గగానే, చిన్నమ్మ చెర మార్చే విషయంగా కసరత్తుల వేగం పెరగడం ఖాయం అన్నది స్పష్టం అవుతోంది. ఇక, ఈ విషయంగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ను కదిలించగా, ఎక్కడ ఉన్నా, చిన్నమ్మ తమిళ ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తారని వ్యాఖ్యానించారు. జైలు మార్పు విషయంగా ప్రస్తుతానికి చర్యలు తీసుకోలేదని దాట వేశారు. శిక్ష అనుభవించాల్సిందే : నాలుగు సంవత్సరాల పాటుగా శశికళ జైలు శిక్షను అనుభవించాల్సిందేనని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కర్జు పేర్కొన్నారు. తిరుచ్చిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పీలుకు వెళ్లే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదన్నారు. పునస్సమీక్షకు మళ్లీ వెళ్లవచ్చన్నారు. పునస్సమీక్ష పిటిషన్లు అనేకం ఇప్పటి వరకు తిరస్కరణకు గురై ఉన్నాయని వివరించారు. నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత పళని స్వామి ప్రభుత్వం గురించి స్పందించగలమని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పన్నీరుకు ప్రజా మద్దతు పుష్కలంగా ఉందని, అయితే, ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడాన్ని పరిగణించాల్సి ఉందన్నారు. -
మార్కండేయ ఖట్జూపై ఎఫ్ఐఆర్
పాట్నా: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూపై బిహార్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. జనతాదళ్ యునైటెడ్(జేడీయూ) ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఖర్జూపై ఫిర్యాదు చేశారు. బిహార్‌ను పాకిస్థాన్‌లో కలపాలంటూ ఖర్జూ చేసిన వ్యాఖ్యలు 10 కోట్ల మంది బిహార్ ప్రజలతోపాటు దేశవిదేశాల్లో ఉన్న భారతీయులందరినీ తీవ్రంగా బాధించాయని నీరజ్ పేర్కొన్నారు. కశ్మీర్‌తోపాటు బిహార్‌ను కూడా పాకిస్థాన్‌కు ఇచ్చేస్తామంటూ..కశ్మీర్ కావాలంటే బిహార్‌తో కలిపి ఒక ప్యాకేజీలాగా ఇస్తామని.. బిహార్ వద్దనుకుంటే రెండింటినీ ఇవ్వబోమని ఆయన ఫేస్బుక్లో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో ఖర్జూపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు పాకిస్థాన్‌కు బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు. వాళ్లు కశ్మీర్ కావాలంటున్నారని, దాన్ని బ్రహ్మాండంగా ఇచ్చేస్తాం గానీ, దాంతో పాటు తప్పనిసరిగా బిహార్ కూడా తీసుకోవాలని అన్నారు. ఇదంతా ఒక ప్యాకేజిలా ఇస్తామని.. అంతేతప్ప బిహార్ వద్దు, కశ్మీరే కావాలంటే మాత్రం కుదరదని చెప్పారు. ఇలా మాట్లాడుతున్నందుకు ఆయనను దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయొచ్చని కూడా కొందరు నాయకులు అన్నారు. ఇక తనకు ఇప్పుడే పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం వచ్చిందని.. వాళ్లు కశ్మీర్‌ను వదులుకుంటాం గానీ బిహార్ మాత్రం వద్దని చెప్పారని ఆయన మరో పోస్టులో పెట్టారు. కశ్మీర్ కావాలని అడిగినందుకు వాళ్లు క్షమాపణ చెప్పారని, భవిష్యత్తులో ఎప్పుడూ అలా చేయబోమని హామీ ఇచ్చారని అన్నారు. బిహార్ కూడా తీసుకోవాలన్న ఆలోచనే వాళ్లను విపరీతంగా భయపెట్టిందని తెలిపారు. ఒకప్పుడు అలహాబాద్ యూనివర్సిటీలో తమ ఇంగ్లీషు అధ్యాపకుడు ఫిరాఖ్ గోరఖ్‌పురి తనకు ఒక విషయం చెప్పారని, భారతదేశానికి పాకిస్థాన్‌తో ఎలాంటి ముప్పు లేదు గానీ బిహార్‌తోనే ఉందన్నారని కూడా ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో ఈమధ్య బాగా చురుగ్గా ఉంటున్న మార్కండేయ కట్జు.. తన ట్విట్టర్, ఫేస్బుక్ పేజీలలో ఈ అంశంపై పోస్టులు పెట్టారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ నాయకులు భగ్గుమన్నారు. అయితే తనకు బిహారీలంటే గౌరవం ఉందని, గౌతమ బుద్ధుడు, చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు లాంటి దిగ్గజాలు బిహార్ నుంచే వచ్చారని ఆయన అన్నారు. ''పాకిస్థాన్‌కు నిజంగా ఈ ఆఫర్ ఇస్తున్నాననుకుంటున్నారా? నేను చాలామంది గురించి జోకులు వేస్తుంటాను. ఇది కూడా అలాంటి జోకే.. జనానికి సెన్సాఫ్ హ్యూమర్ కాస్త పెరగాలి'' అని తెలిపారు. కట్జు ఇలా అన్నా.. నాయకులు మాత్రం ఆయనను శిక్షించాల్సిందేని పట్టుబట్టారు. కట్జును వెంటనే అరెస్టుచేయాలని, ఆయనపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ బిహార్ ప్రధాన అధికార ప్రతినిధి వినోద్ నారాయణ్ ఝా అన్నారు. భారత సమగ్రతను దెబ్బతీసేందుకు జాతివ్యతిరేక శక్తులతో కట్జు ఏమైనా చేతులు కలిపారా అన్న అనుమానాలను సైతం ఆయన లేవనెత్తారు. ఇది కచ్చితంగా దేశద్రోహమే అవుతుందని, కట్జుపై కఠిన చర్యలు తీసుకోవాలని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. I have just received authoritative information from Pak Govt They have point blank refuse offer of taking Kashmir along with Bihar. They — Markandey Katju (@mkatju) 26 September 2016 profusely apologized for ever asking for Kashmir,& have promised never to do it again. The idea of getting Bihar too has horrified them — Markandey Katju (@mkatju) 26 September 2016 Once Firaq Gorakhpuri, my English teacher in Allahabad University, said 2 me " Hindustan ko khatra Pakistan se nahin hai, Bihar se hai ". — Markandey Katju (@mkatju) 26 September 2016 Santa Who supports terrorism? Banta Pak Santa Who supports Pak? Banta Bihar Santa How? Banta :Pak got all its ideas of jungle raj from Bihar — Markandey Katju (@mkatju) 26 September 2016 Bhaj man Biharayan, Biharayan, Biharayan — Markandey Katju (@mkatju) 27 September 2016 Mr. K.C. Tyagi,Gen.Sec. of JDU said I should be charged for sedition. I have a better suggestion. I should be charged under the Lunatics Act — Markandey Katju (@mkatju) 27 September 2016 Complaint by Biharis to me तुझे अठखेलियां सूझीं हम बेज़ार बैठे हैं Tujhe athkheliyan soojhin, hum bezaar baithe hain Urdu poet Insha — Markandey Katju (@mkatju) 27 September 2016 -
వాళ్లకు తెలివితేటలు తక్కువ: మార్కండేయ కట్జూ
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మరోసారి తన నోటికి పని చెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో చాలామందికి తెలివితేటలు తక్కువ అని వ్యాఖ్యానించారు. జడ్జీలను నియమించే కొలీజియం వ్యవస్థ గురించి కట్జు ఇటీవలి కాలంలో తరచు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. దీనివల్ల అవినీతిపరులు, అసమర్థులు సుప్రీంకోర్టు జడ్జీలుగా వస్తున్నారని అన్నారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు మీద అవినీతి ఆరోపణలు చేసి, వాటిపై విచారణ జరిపించాలని కూడా కట్జు డిమాండ్ చేశారు. ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలతో న్యాయవ్యవస్థ మీద బురద చల్లారు. ''భారతీయ సుప్రీంకోర్టు జడ్జీల నేపథ్యం గురించి, వాళ్ల తెలివితేటల గురించి భారతీయులందరికీ చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లలో కొందరికి అద్భుతమైన వ్యక్తిత్వం, మంచి పరిజ్ఞానం ఉన్నాయి.. అందుకు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ నారిమన్ లాంటివాళ్లు ఉదాహరణ. కానీ ప్రస్తుత సుప్రీంకోర్టులో ఉన్న చాలామంది జడ్జీల తెలివితేటలు మాత్రం చాలా తక్కువ'' అని ఆయన తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు. ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కోరా అని ఒక ఫాలోవర్ కామెంట్ రాయగా.. కోర్టు ధిక్కార విచారణలో 'నిజం' అనేది ఒక డిఫెన్స్ పాయింట్ అని చెప్పారు. -
'నగ్నచిత్రాలు చూసి రెచ్చిపోవద్దు'
ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే సుప్రీంకోర్టు మాజీ జడ్జి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ మార్కండేయ కట్జు ఈసారి మరో వివాదాస్పద అంశంపై స్పందించారు. రంజాన్ మాసంలో ముస్లింల సెంటిమెంట్లను దెబ్బతీసేందుకు రెచ్చగొట్టే ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారని, వాటిని చూసి రెచ్చిపోవద్దని ముస్లింలను కోరారు. ఈ మేరకు ఆయన తన ఫేస్బుక్ పేజీలో రాసి, ఆ లింకును ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఒక మహిళ తన బురఖాను పక్కకు తీసి, నగ్నంగా కాబా పైన నిల్చున్నట్లు ఒక ఫొటో సోషల్ మీడియాలో కనిపిస్తోందని ఆయన చెప్పారు. మరో ఫొటోలో ఇద్దరు అమ్మాయిలు నగ్నంగా బీచ్‌లో పడుకుని ఉంటారని, దానికి 'ఇది రంజాన్. బికినీలు వేసుకోవద్దు' అనే కేప్షన్ పెట్టారని కట్జు తెలిపారు. ట్విట్టర్లో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయని హెచ్చరించారు. ఇలాంటి ట్వీట్లు చూసి అనవసరంగా ఉద్రేకాలకు లోనుకావద్దని ముస్లింలను ఆయన కోరారు. ఇలాంటివాటిని పట్టించుకోకుండా వదిలేయాలని, కావాలనే కొంతమంది రెచ్చగొట్టడానికి ఇలా చేస్తుంటారని తెలిపారు. Provocative pictures are being shown on Social Media to hurt Muslim sentiments during Ramzan. pic.twitter.com/BMXxUWB5Jv — Markandey Katju (@mkatju) 10 June 2016 -
గాంధీపై కట్జూ వ్యాఖ్యలకు రాజ్యసభ ఖండన
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ బ్రిటిష్ ఏజెంట్, సుభాష్‌చంద్రబోస్ జపాన్ ఏజెంట్ అంటూ సుప్రీం కోర్టు మాజీ జడ్జి మార్కండేయ కట్జూ చేసిన వ్యాఖ్యలను బుధవారం రాజ్యసభ తీవ్రంగా ఖండించింది. జీరో అవర్‌లో ప్రతిపక్షం సూచనపై సభ చైర్మన్ హమీద్ అన్సారీ చేసిన తీర్మానం మేరకు సభ పై విధంగా స్పందించింది. రాజ్యసభలో అధికార పార్టీ పక్ష నేత అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ గాంధీజీపై కట్జూ వ్యాఖ్యలు ప్రతిపక్షంతో పాటు అందరినీ బాధించాయన్నారు. మహ్మాతుడు ఈ శకానికే గొప్ప మనిషి అని ప్రశంసించారు. మన దేశానికి స్వాతంత్య్రాన్ని ఆర్జించి పెట్టడంలో ఆయన కృషి ఎంతో శ్లాఘనీయమన్నారు. కట్జూకు మాజీ న్యాయమూర్తి హోదాలో ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. -
లహోతీజీ.. వీటికి జవాబివ్వండి: కట్జూ
ఓ అవినీతి జడ్జి పదవీకాలం కొనసాగించే విషయంలో ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు(సీజేఐలు) అసమంజసంగా రాజీపడ్డారని వ్యాఖ్యలు చేసి దుమారం రేపిన సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ.. మంగళవారం కూడా తన ఆరోపణలను పునరుద్ఘాటించారు. ఈ ఆరోపణల గురించి తాను నిర్దిష్టంగా వేస్తున్న 6 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ముగ్గురు సీజీఐలలో ఒకరైన జస్టిస్ ఆర్.సి.లహోతీకి కట్జూ తన బ్లాగులో ప్రశ్నించారు. ఆ ప్రశ్నలివీ.. మద్రాస్ హైకోర్టుకు చెందిన ఓ అదనపు జడ్జిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయని, దీనిపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ)తోరహస్య దర్యాప్తు చేయించాలని నేను చెన్నై నుంచి ఆయనకు(లహోతీకి) లేఖ రాసిన మాట వాస్తవమా కాదా? తర్వాత ఇదే అంశంపై నేను ఆయన్ను ఢిల్లీలో కలిసింది నిజమా కాదా?నా అభ్యర్థన మేరకు జస్టిస్ లహోతీ ఆ అదనపు జడ్జిపై ఇంటెలిజెన్స్‌తో దర్యాప్తు చేయించింది నిజమా కాదా? నేను జస్టిస్ లహోతీని ఢిల్లీలో కలిసి చెన్నై వచ్చిన తర్వాత.. ఆయన నాకు ఫోన్ చేసి.. అదనపు జడ్జిపై దర్యాప్తు చేయించానని, అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిందని చెప్పిన మాట వాస్తవమా కాదా?ఐబీ నివేదిక వచ్చాక సమావేశమైన త్రిసభ్య కొలీజియం.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించవద్దని ప్రభుత్వానికి సిఫార్సు చేయడం నిజమా కాదా?కొలీజియం సిఫార్సులను ప్రభుత్వానికి పంపిన తర్వాత.. ఆయన కొలీజియంలోని మిగతా ఇద్దరు సభ్యులనూ సంప్రదించకుండా తనంతట తానుగా ప్రభుత్వానికి లేఖ రాసి.. ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని కోరడం నిజమా కాదా?ఐబీ దర్యాప్తులో అవినీతి ఆరోపణలు నిజమేనని తేలిన తర్వాత కూడా ఆయన ఆ అదనపు జడ్జి పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాశారు? -
న్యాయవ్యవస్థలో అవినీతిపై జస్టిస్ కట్జు ధ్వజం
న్యాయవ్యవస్థలో అవినీతికి అడ్డులేకుండా పోతోందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జు మండిపడ్డారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ అయిన ఆయన.. సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ ప్రధాన న్యాయమూర్తులపై కూడా ఆరోపణాస్త్రాలు సంధించారు. యూపీఏ ప్రభుత్వం చెప్పడంతో మద్రాసు హైకోర్టులో ఓ అదనపు జడ్జికి పదవీకాలం పొడిగించారని ఆయన ఆరోపించారు. తమిళనాడులోని ఓ ప్రాంతీయ పార్టీ చెప్పడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన అన్నారు. జస్టిస్ ఆర్సీ లహోటీ, జస్టిస్ వైకే సభర్వాల్, జస్టిస్ కేజీ బాలకృష్ణన్.. ఈ ముగ్గురూ కూడా బోలెడన్ని ఆరోపణలున్న అదనపు జడ్జిని కొనసాగించారని జస్టిస్ కట్జు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని జస్టిస్ లహోటి ప్రారంభించగా ఆ తర్వాత జస్టిస్ సభర్వాల్, జస్టిస్ బాలకృష్ణన్ కొనసాగించారని ఆయన అన్నారు. రాజకీయ ఒత్తిడికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా లొంగిపోతారా అంటూ కట్జు ప్రశ్నించారు. అదనపు జడ్జి మీద బో్లెడన్ని ఆరోపణలున్నాయని, వాటిపై తన ఫిర్యాదు మేరకు నాటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లహోటి రహస్యంగా ఐబీ విచారణ కూడా జరిపించారని కట్జు తెలిపారు. అందులో ఆరోపణలు నిజమని తేలినప్పుడు.. ఆయన్ని తీసేయాల్సింది పోయి.. ఇంకా చాలా కాలం పాటు కొనసాగించడంతో తాను దిగ్భ్రాంతి చెందానన్నారు. తమిళనాడులోని ఒక ప్రాంతీయ పార్టీ మీద యూపీఏ-1 ప్రభుత్వం ఆధారపడి ఉండటమే దీనంతటికీ కారణమని తనకు తెలిసినట్లు కట్జు చెప్పారు. ఆ పార్టీ నాయకుడికి అదనపు జడ్జి ఒకసారి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావడం వల్లే ఇదంతా జరిగిందన్నారు.